Gopapa gopala venkatesh birthday special photos

gopala gopala photos, gopala gopala latest photos, gopala gopala venkatesh photos, gopala gopala pawan kalyan photos, gopala gopala release date, gopala gopala latest updates, venkatesh birthday photos, pawan kalyan upcoming movie updates, tollywood latest news updates

gopapa gopala venkatesh birthday special photos : gopala gopala unit announced to release movie photos on the occassion of venkatesh birthday. pawan kalyan and venkatesh fans waiting for more photos of gopala gopala which set ti blast on venkatesh birthday

వెంకీ బర్త్ డే : పవన్ ఫ్యాన్స్ కు పండగ

Posted: 12/12/2014 09:03 AM IST
Gopapa gopala venkatesh birthday special photos

షూటింగ్ పూర్తి చేసుకున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సంక్రాంతి కానుకగా దూసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. కొద్ది రోజుల క్రితం విడుదల అయిన సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ ఫోటోలతో పాటు, బ్యాగ్రౌండ్ ట్యూన్ కూడా క్రేజ్ కొట్టేసింది. దీంతో మరిన్ని ఫోటోలు కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వీరి కామెంట్లు, రిక్వస్టుల కోసం వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 13న మరిన్ని ఫోటోలు విడుదల చేస్తానని మూవీ యూనిట్ ప్రకటించింది.

మూవీ యూనిట్ ప్రకటనతో పవన్, వెంకటేష్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఫోటోలు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ పుట్టిన రోజున ఆయన ఫ్యాన్స్ తో పాటు.., పవన్ ఫ్యాన్స్ కూడా ఫోటోలతో పండగ చేసుకుంటామని చెప్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన రావటంతో పాటు.., డిజైనర్లను పవన్ స్వయంగా మెచ్చుకున్నారు. దీంతో లేటెస్ట్ ఫొటోలను మరింత ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఇందుకోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘గోపాల గోపాల’ విడుదల అవుతుందని మూవీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల చివర్లో సినిమా పాటలు విడుదల కానున్నాయి. కథ నేపథ్యంలో సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నట్లు టాక్ విన్పిస్తోంది. ‘ఓ మై గాడ్’ బాలీవుడ్ మూవీ రీమేక్ గా వస్తున్న ‘గోపాల గోపాల’ను కిశోర్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్, శరత్ మరార్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala photos  venkatesh birthday  pawan kalyan updates  

Other Articles