Rajinikanth lingaa movie release court order

lingaa movie court case, court on lingaa movie, lingaa movie court fine, lingaa story copied, rajinikanth lingaa movie cases issue, lingaa movie photos teasers, lingaa latest updates, rajinikanth latest updates, koliwood latest updates

rajinikanth lingaa movie release court order : tamilnadu court orders lingaa movie unit to pay rupees 10 crores to court before 12th december 2014 and release movie, rockline venkatesh agrees court decission and says he will pay rupees 10 crores to court

దెబ్బలతో తప్పించుకున్న ‘లింగా’.. భయంతో వణుకుతున్న రజినీ టీం

Posted: 12/11/2014 03:59 PM IST
Rajinikanth lingaa movie release court order

రజినీకాంత్ ‘లింగా’ సినిమాకు పెద్ద గండమే తప్పిందనుకోవాలి. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే మరోవైపు కాపీరైట్ కష్టాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. సినిమా విడుదల నేపథ్యంలో స్పందించిన మధురై హైకోర్టు.., ‘లింగా’కు డిపాజిట్ చెల్లించాలని షరతు విధించింది. శుక్రవారం మధ్యాహ్నంలోపు రూ.10కోట్లు చెల్లించి సినిమా విడుదల చేసుకోవాలని ఆదేశించింది. డబ్బులు కట్టడం కూడా ఇబ్బందికర అంశమైనా.., సినిమా విడుదల ఆపకుండా తీర్పు ఇచ్చినందుకు మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.., రవిరత్నం అనే నిర్మాత ‘లింగా’ సినిమా కథ తనది అని కోర్టులో పిటిషన్ వేశాడు. దర్శకుడు, రచయిత తన కథను కాపి కొట్టారని పిటిషన్ లో ఆరోపించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన కోర్టు.., పిటిషనర్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంది. సినిమా విడుదలకు గడువు తక్కువగా ఉన్నందున.., ముందస్తు పూచికత్తుగా రూ.10కోట్లు చెల్లించి విడుదల చేసుకోవాలని రాక్ లైన్ నిర్మాణ సంస్థను ఆదేశించింది. తీర్పుపై స్పందించిన రాక్ లైన్ వెంకటేష్.., కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. డబ్బులు చెల్లించి సినిమాను విడుదల చేసుకుంటామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 12న ‘లింగా’ విడుదల అవుతుందన్నారు.

రజినీ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు గతంలో కూడా కాపీ కష్టాలు వచ్చాయి. కథ తనది అంటూ ఓ రచయిత కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అంతలోనే ఇలా నిర్మాత కేసు వేయటంతో మళ్ళీ ఇబ్బందులు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం వరకూ కోర్టు నిర్ణయం రాకపోవటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. సినిమా విడుదల అవుతుందా.. కాదా అని ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటికీ కోర్టు తీర్పు పూర్తిగా వెలువడలేదు. కేసు విచారణ జరిగి ‘లింగా’ కథ కాపి కొట్టారని నిర్ధారణ అయితే.., మూవీ యూనిట్ కు ప్రస్తుత రూ.10కోట్లు లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది. దీంతో సినిమా విడుదల తర్వాతైనా కష్టాలు తీరతాయా... లేదా అని భయం ‘లింగా’ యూనిట్ లో నెలకొంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa movie fine  court on lingaa movie  rajinikanth latest  

Other Articles