Rajanikanth movie linga continues to face obstacles

rajani linga movie, linga movie updates, rajni linga movie problems, rajnikanth linga movie news, linga movie news, sonakshi sinha, anushka shetty, rajnikanth problems, director ks ravikumar, music director ar rahman, ar rahman, rajnikanth latest news, rajnikanth latest movie news, rajani linga movie face obstacles, rajani linga movie obstacles

rajanikanth movie linga continues to face obstacles even at the stage of release

రజనీ ‘లింగ’ను వెంటాడుతున్న బాలారిష్టాలు..

Posted: 12/10/2014 10:55 AM IST
Rajanikanth movie linga continues to face obstacles

దక్షిణాధి సూపర్ స్టార్ రజనీకాంత్.. తాజా చిత్రం లింగ ను ఇంకా బాలారిష్టాలు వదలడం లేదు. లింగ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో కూడా ఇంకా వివాదాలు వెంటాడుతూనే వున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ఈ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నా.. అన్నింటినీ పరిష్కరించుకుని వస్తున్న నేపథ్యంలో లింగ చిత్రాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. భారీ స్థాయి అంచనాలతో.. అభిమానులకు కనువిందు చేసేందుకు వస్తున్న ఈ చిత్రం తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.

గతంలో ఇంద్ర సినిమా రీమేక్ రైట్స్ పోందిన బాలాజీ స్టూడియో.. లింగ చిత్రం కాపీ రైట్స్ తమ వద్ద వున్నాయంటూ కొత్త వివాదానికి తెరలేపింది. తాము రైట్స్ పోందిన ఇంధ్ర సినిమా తరహాలోనే లింగ చిత్రం వుందంటూ వారు కేసు వేశారు. ఇద్దరు తరపున వాదనలు విన్న న్యాయస్థానం లింగ సినిమా విడుదలను నిలపివేయడానికి నిరాకరించింది. ప్రత్యర్థి కోరినట్లుగా సినిమా విడుదలసై స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది.

దీంతో చివరి సమస్యను కూడా అధిగమించిన రజనీ లింగ మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సుమారుగా 2300 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నాయికలుగా నటిస్తున్నారు. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, ఏ ఆర్ రహమాన్ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Rajanikanth  linga movie updates  sonakshi sinha  anushka shetty  

Other Articles