Avika gor not wears glamour exposing dress

avika gor on exposing, avika gor on modern glamour dresses avika gor next movie updates, avika gor latest news updates, avika gor on pawan kalyan amitabh, pawan kalyan upcoming movie updates, tollywood heroines exposing, telugu movie latest updates

avika gor not wears glamour exposing dress : young heroine and small screen popular actress avika gor says she will never wear small dress even no movie offers. if it is pawan kalyan movie or big b movie i don't care no exposing will be expected from my side says avika gor

అమితాబైనా, పవనైనా సరే.. నా దగ్గర ఆ పప్పులుడకవు

Posted: 12/08/2014 02:43 PM IST
Avika gor not wears glamour exposing dress

రెండు సినిమాలు చేస్తే చాలు., తామే ఇక టాప్ హీరోయిన్లమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. ఎవరైతే నాకేంటి.., అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తుంటారు. తమ స్థాయిని మర్చిపోయి నోటికి ఎవరి పేరు వస్తే వారితో పోలికలు వర్ణించటం వీరికి షరా మామూలైంది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయమై..,, ‘ఉయ్యాల జంపాల’తో వెండితెరపైకి ఎక్కిన అవికా గోర్ ఇప్పటివరకు రెండు సినిమాలు చేసింది. ఈ రెండు మూవీల్లోనూ ఎక్స్ పోజింగ్ కు అమ్మడు దూరంగా ఉంది. తర్వాతి సినిమాల సంగతేమిటని ప్రశ్నిస్తే ఇదిలాగే ఎప్పటికి ఉంటుందని గ్లామర్  షోకు నో చెప్పింది.

తానెప్పుడూ చిన్న చిన్న బట్టలు వేయనని అవిక స్పష్టంగా చెప్పేసింది. ‘నాకు మోడ్రన్ బట్టలంటే అస్సలు నచ్చదు, ప్రేక్షకులు కూడా ఇంట్లో అమ్మాయిలా చూడాలి అనుకుంటున్నారు’ అని చెప్పింది. కాబట్టి ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్ లలో కన్పించనని క్లారిటి ఇచ్చేసింది. ఒక రొమాంటిక్ సన్నవేశాలకు కూడా దూరంగా ఉంటానని ప్రకటించుకుంది. నో ఎక్స్ పోజింగ్, నో రొమాన్స్ నినాదంతోనే సినిమాలు చేస్తుందట. సినిమా ఛాన్సులు లేకపోయినా సరే కానీ ఈ నినాదం మాత్రం వదలిపెట్టనని భీష్మించుకుకూర్చుంది.

తన స్ట్రాటజీని కాస్త క్లియర్ గా చెప్పేందుకు మరి ఎక్కువగా ప్రయత్నించింది. ‘నాకు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తాను. పాత్రపై ఫీల్ రాకపోతే.. అమితాబ్ సినిమా అయినా, పవన్ సినిమా అయినా వదిలేస్తాను’ అని చెప్పుకుంది. ఈ పోలిక కాస్త ఓవర్ గా అన్పించింది. కాలంను బట్టి అందరూ మారినట్లే అవిక కూడా మారక తప్పదు.., ఇవాళ చుడి దార్స్ అన్న అమ్మాయి రేపు జీన్స్ పాప.., ఆ తర్వాత స్కర్టు గర్ల్ గా మారటం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. వారి అంచనాలు నిజమవుతాయా లేక అవిక మాటపై నిలబడుతుందా అనేది తర్వాతి సినిమాలు చూస్తుంటే తెలిసిపోతుంది. ప్రస్తుతం 50 నుంచి 60 లకారాలు తీసుకుంటున్న చిన్నారి హీరోయిన్ త్వరలోనే  రేటు కూడా పెంచేస్తుందని టాక్. అన్ని దగ్గర పెట్టుకుని పంచటానికి నో  అంటే.., రేటు పెంచటానికి ఎవరు ముందుకు వస్తారో... ఆఫర్లు ఇస్తారో వెయిట్ అండ్ సీ.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : avika gor movies  pawan kalyan comments  tollywood updates  

Other Articles