Chiranjeevi attends lingaa movie telugu audio release

lingaa telugu audio release, chiranjeevi in lingaa audio release, chiranjeevi meets rajinikanth, lingaa telugu audio release, lingaa release date, lingaa telugu songs, lingaa movie latest photos trailers, lingaa movie cast and crew, tollywood latest news updates

chiranjeevi attends lingaa movie telugu audio release : koliwood super star asks chiranjeevi to support lingaa movie by attending audio release function, tollywood mega star to attend koliwood super star latest movie lingaa audio release function

ఎంతటివారైనా సాయం కోరాల్సిందే

Posted: 12/08/2014 10:57 AM IST
Chiranjeevi attends lingaa movie telugu audio release

బాలీవుడ్ ప్రముఖులయినా.., కోలీవుడ్ సూపర్ స్టార్లు అయినా సరే టాలీవుడ్ లో పాపులర్ కావాలంటే మెగా ఫ్యామిలీ అండదండలు తప్పనిసరి. చిరంజీవి, పవన్ ఇలా మెగా ఫ్యామిలి హీరోల పేర్లు చెప్పుకుని సినిమాల ప్రమోషన్ చేసుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. ఈ వరుసలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చేరాడు. తమిళంలో సూపర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న రజినీకి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే మెగాస్టార్ క్రేజ్ వాడుకుంటే ఈ ఫాలోయింగ్ మరింత పెంచుకోవచ్చని డిసైడ్ అయి చిరుతో స్నేహం చేస్తున్నారు.

ఇవాళ విడుదల అవుతున్న ‘లింగా’ ఆడియో రిలీజ్ వేడుకకు చిరంజీవిని రజినీ ఆహ్వానించారు. సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగే ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరవుతారని ‘లింగా’యూనిట్ వర్గాలు ప్రకటించాయి. చిరు వస్తే వేడుకకు కొత్తదనం.., నిండుదనం కలుగుతుందనే ఇలా చేస్తున్నారట. ఇక కార్యక్రమంలో చిరంజీవితో పాటు మూవీలో హీరోయిన్ గా నటించిన సోనాక్షి సిన్హా, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మన్ తదితరులు పాల్గొంటున్నారు. ఆడియో ఫంక్షన్ కోసం రజినీ, సోనాక్షి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.

ఈనెల 12న రజిని పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కేఎస్ రవికుమార్ భారీ బడ్జెట్  తో తెరకెక్కించిన ఈ సినిమాకు రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరించారు. రెహ్మాన్ సంగీతం అందించారు. రజినీ డ్యూయల్ రోల్ పోషిస్తున్న మూవీలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ కథను కాపీ చేశారంటూ ఇప్పటివరకు ఇద్దరు రచయితలు కోర్టుకెక్కారు. వీరిలో ఒకరి కేసును కోర్టు కొట్టేయగా.., మరొకటి పెండింగ్ లో ఉంది. విడుదలకు మరో మూడు రోజులే సమయం ఉండటంతో కేసు ఏ మలుపు తిరుగుతుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa audio release  chiranjeevi latest updates  rajinikanth in hyderabad  

Other Articles