Ntr temper movie shooting latest look updates

Ntr Temper Movie Shooting, Temper Movie Latest Update, Ntr Latest Look Photo Temper movie, Kajal Aggrawal in Temper Movie, Temper Movie Release Date, Temper Movie Photos, Temper Cast and Crew, Tollywood Latest Movie Updates

Ntr Temper Movie Shooting Latest Look Updates : Ntr Latest Movie Temper Shooting Will Start From 10th December After Tollywood Workers Strike Called Off. Temper Movie Unit Released Latest Photo Of NTR On 5th December

పూరి కాన్ఫిడెన్స్ అంటే ఇదేనేమో

Posted: 12/06/2014 11:35 AM IST
Ntr temper movie shooting latest look updates

ఎన్టీఆర్ తో చాలాకాలం తర్వాత రెండవ కాంబినేషన్ సినిమా తెరకెక్కిస్తున్న పూరీ జగన్నాధ్.., షూటింగ్ ను పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అంతా అనుకున్నట్లే జరిగితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి అవ్వాల్సింది. కాని సమ్మె వల్ల షూటింగులు నిలిచిపోయాయి. నిర్మాతలతో చర్చలు సఫలం కావటంతో తిరిగి షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 10 నుంచి ‘టెంపర్’ చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలు పెడతారని మూవీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

వారం రోజుల పాటు జరిగే షూటింగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలిస్ స్టేషన్, కోర్టు సెట్టింగులు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షూటింగ్ తో పాటే జరుగుతుండటంతో సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.., శుక్రవారం రోజు (డిసెంబర్)5న ఎన్టీఆర్ లేటెస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో కూడా తారక్.., ఫుల్ స్టైలిష్ గా కన్పిస్తున్నాడు. గోవా బీచ్ లో స్కై బ్లూ కలర్ షర్ట్ తో సాంగ్ కు సంబంధించిన ఫోటో స్టిల్ తో లుక్ ఇచ్చాడు. ఫస్ట్ లుక్ ఫోటొల్లో కూడా గోవా బీచ్ లో బాడీ షో పెట్టిన విషయం తెలిసిందే. అంటే ఈ సినిమాలో గోవా సన్నివేశాలు కీలకం అవుతాయని తెలుస్తోంది.

Temper-New-Look

‘ఆంధ్రావాలా’ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి పూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.., సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు. హిట్ హీరోయిన్ గా పేరున్న కాజల్ అగర్వాల్ ఇందులో నటిస్తోంది. మూవీకి సంబంధించి లీకైన అమ్మడి బీచ్ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper Movie Shooting  Ntr Latest photos  Puri jagannath Movies  

Other Articles