Telugu actress poorna cameraman bharani love affair tollywood news

actess poorna, poorna bharani, poorna cameraman bharani, poorna love affairs, poorna hot photos, poorna latest news, poorna photo shoot, poorna movies, poorna cameraman love affairs, actress love affairs, heroines love affairs, tollywood affairs, heroes affairs

telugu actress poorna cameraman bharani love affair tollywood news : Accoring to tollywood there are some rumours going on actress poorna that she is in love with cameraman bharani to get movie offers

కెమెరామెన్ భరణితో నటి పూర్ణ @ లవ్ ఎఫైర్!

Posted: 12/05/2014 09:41 PM IST
Telugu actress poorna cameraman bharani love affair tollywood news

‘అవును’ హారర్ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణకు అవకాశాలు అంతగా ఏమీలేవుగానీ.. ఈమధ్య లవ్ ఎఫైర్స్ మాత్రం బాగానే వున్నాయని టాలీవుడ్’లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత విషయాలను కాస్త పక్కనపెడితే.. కొన్నిరోజుల నుంచి ఈ అమ్మడు కెమెరామెన్ భరణతో ప్రేమాయణం నడుపుతోందంటూ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంట చట్టాపట్టాలేసుకుని బాగానే షికార్లు చేస్తున్నారని.. అప్పుడప్పుడు రహస్యంగా కలుసుకుంటున్నారని కథనాలొస్తున్నాయి.

అంతేకాదు.. ఈ అమ్మడికి సంబంధించిన సినిమా వ్యవహారాలు మొత్తం ఆ కెమెరామెన్ చూసుకుంటున్నాడని, అతడు చెప్పినట్లుగానే ఆమె నడుచుకుంటోందని ప్రచారాలు జరుగుతున్నాయి. చేతిలో సరిగ్గా ప్రాజెక్టులు లేకపోవడం వల్లే కెమెరామెన్’ను బుట్టలో పడేసిందని విశ్లేషకుల అభిప్రాయం! పైగా ఆ ఇద్దరి వ్యవహారంపై అప్పుడే సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని.. అసలు తమ మధ్య ఎటువంటి రిలేషన్’షిప్ లేదని అమ్మడు పూర్ణ ఖండిస్తోంది.

‘అయ్యోరామా.. కెమెరామెన్ భరణితో నాకు ఎఫైర్ ఏంటి? అసలు అతనితో కలిసి నేను ఒక్క సినిమా కూడా చేయలేదు. ఏదో ఒకటిరెండు సందర్భాల్లో అనుకోకుండా ఆయన్ను కలిసుంటాను. అంతే తప్ప.. ఆయనతో నాకెలాంటి సంబంధం లేదు’’ అంటూ చెప్పుకొస్తోంది. అయితే.. నిప్పులేనిదే పొగ ఎలా వస్తుందన్నట్టు..? అసలు పరిచయమే లేకపోతే రూమర్లెందుకు వస్తాయి..? ఖచ్చితంగా పూర్ణ తన ప్రేమవ్యవహారాన్ని దాస్తోందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles