Tollywood stars performance highlights in memu saitham programme

tollywood on hudhud, memu saitham programme highlights, memu saitham latest, memu saitham highlights videos, memu saitham chiranjeevi dance and performance, memu saitham balakrishna song, memu saitham balakrishna show, brahmanandam in memu saitham, memu saitham latest updates

tollywood stars performance highlights in memu saitham programme : tollywood stars participated with high energy in memu saitham programme, 12 hours non stop show entertained all audience and tv viewers

అలరించిన మేము సైతం... ఆదుకున్న సినీతారా లోకం

Posted: 12/01/2014 08:46 AM IST
Tollywood stars performance highlights in memu saitham programme

హుద్ హుద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ చేపట్టిన మేము సైతం కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. కార్యక్రమం పూర్తిగా ఉత్సాహంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ తారలతో పాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు విచ్చేసి బాధితులకు తమవంతు సాయం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు హుషారెత్తించే పాటలు, ఆటలు, డాన్స్, కామెడి షోలతో 12గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన షో ప్రేక్షకులను కట్టిపడేసింది. కార్యక్రమం ద్వారా సేకరించిన రూ. 11కోట్ల 51లక్షల 56వేల 116 రూపాయలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినీ పరిశ్రమ అందించింది. 12గంటల కార్యక్రమంలో హైలైట్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

ఉదయం 10గంటలకు ‘మేము సైతం’ కార్యక్రమం ప్రారంభం అయింది. కార్యక్రమంలో పలువురు సింగర్లు ‘మేము సైతం’ అంటూ పాట పాడగా నటి శ్రియ డాన్స్ చేసి షోను మొదలు పెట్టింది. ఇక ఆ తర్వాత నట సింహం బాలకృష్ణ ‘చలాకీ చూపులతో మత్తెక్కించావే’ అంటూ కౌసల్యతో కలిసి పాడి అందర్ని అలరించారు. ఆ తర్వాత పురాణా పాత్రల మద్య సంబంధాలను అడిగి వాటికి జవాబులు ఇస్తూ సరదాగా సాగే ఒక ప్రదర్శన ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. కమెడియన్ ఎం.ఎస్.నారాయణ చేసిన స్కిట్ నవ్వులు పూయించింది.


ఇక కామెడి బ్రహ్మ బ్రహ్మానందం సోలో ప్రదర్శనతో అందర్నీ అలరించారు. పాత సినిమాల డైలాగులతో పాటు, తన సినిమాల్లోన కొన్ని డైలాగులను చెప్పి ప్రేక్షకులు, అతిధులను నవ్వించారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సమంతతో కలిసి చేసిన స్కిట్ కూడా ఆకట్టుకుంది. సమంత ఫన్నీ ప్రశ్నలు వేస్తుండగా.., వాటికి మహేష్, త్రివిక్రమ్ సమాధానాలు చెప్తూ సరదాగా సాగిపోయింది. సమంత అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.., ‘పవన్, మహేష్ ఇద్దరూ సహజంగా నటించే గుణాలున్న వారు అని తెలిపాడు. ఇక కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన కబడ్డి జట్టులో విష్ణు జట్టును మంచు మనోజ్ జట్టు ఓడించింది. ఇక నటి రాశిఖన్నా కళ్యాని మాలిక్ తో కలిసి ఓ పాట పాడి అందరిచే ప్రశంసలు పొందింది.

అటు టాలీవుడ్ తారలంతా కలిసి క్రికెట్ ఆడారు. లేడి స్టార్లు కూడా ఇందులో పాల్గొని మగవారితో సమానంగా ఆడి సత్తా చాటారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండు ఫోర్లు కొట్టింది. వెంకటేష్, రామ్ చరణ్, నాగార్జునతో పాటు ఇతర స్టార్లు ఉత్తమ ప్రతిభ చూపారు. పైనల్ లో వెంకటేష్ జట్టుపై నాగార్జున జట్టు విజయం సాధించింది. ఇక ‘బాహుబలి’ టీం ప్రత్యేక వంటకాలు చేసి నోరూరించేలా చేసింది. సాయంత్రం మొదలైన సంగీత కచేరి (అంత్యాక్షరి) అందర్ని ఆకట్టుకుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తారలంతా ఇందులో పాల్గొన్నారు. వెంకటేష్, చిరంజీవి, రవితేజ, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ తదితరులు తమ ఆట, పాటలతో స్టేజిని ఓ ఊపు ఉపేశారు. చిరంజీవిని వెంకటేష్, రవితేజ కలసి స్టేజిపైకి తీసుకెళ్ళారు. డాన్స్ చేయాలంటూ పట్టుబట్టారు. చాలా కాలం కావటంతో మర్చిపోయానని చెప్పినా విన్పించుకోలేదు. వీరికి దేవిశ్రీ వంత పాడుతూ.. పాట కూడా పాడారు. దీంతో చిరంజీవి స్టెప్పులేయక తప్పలేదు. చిరు డాన్స్ అయిపోగానే.., అల్లు అర్జున్, శ్రీకాంత్ మిగతా నటులు స్టేజిపైకి వచ్చి చిరును ఎత్తుకుని మరోసారి డాన్స్ చేశారు.



ఇలా ‘మేము సైతం’ కార్యక్రమం సందడిగా సాగిపోయింది. బాధితులను ఆదుకునేందుకు తారా లోకమంతా ఏకమై కదిలివచ్చింది. విశాఖనే కాదు.., తెలుగువారికి ఏ ప్రాంతంలో కష్టం వచ్చినా ఆదుకునేందుకు టాలీవుడ్ పరిశ్రమ ముందుకు వస్తుందని ఈ షో ద్వారా సందేశం పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  memu saitham  chiranjeevi  balakrishna  hud hud  

Other Articles