Ntr puri jagannath temper movie police daya nayak real story

ntr temper movie story, temper movie story linge real concept, daya nayak story for ntr temper movie, ntr temper movie character name, puri jagannath on daya nayak, temper movie first look photos, temper movie ntr kajal photos, tollywood latest news, temper cast and crew, puri jagannath next movie, ntr next movie updates, daya nayak movies

ntr puri jagannath temper movie police daya nayak real story : latest rumor on tollywood young tiger ntr movie that his movie story is about powerful police officer daya nayak of maharasthra, puri jagannath makiing ntr temper movie with police daya nayak real life story

‘టెంపర్’ ఓ రియల్ స్టోరీ...?

Posted: 11/28/2014 09:07 AM IST
Ntr puri jagannath temper movie police daya nayak real story

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘టెంపర్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. యంగ్ టైగర్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా ఇరగదీస్తాడు అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిపోతుంది. భారీ అంచనాల మద్య తెరకెక్కుతున్న ఈ మూవీ కథపై ఫిలింనగర్ లో ఓ పుకారు తెగ ప్రచారంలో ఉంది. ఈ మూవీని రియల్ పోలిస్ ఆఫీసర్ స్టోరీ నుంచి తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు అనుకుంటున్నారు. ఆయనెవరో కాదు మహారాష్ర్ట సూపర్ పోలిస్ ‘దయా నాయక్’. దయా పోలిస్ జీవితం నుంచే ఈ స్టోరీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ సూపర్ పోలిస్ జీవితం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. హిందిలో ‘అబ్ తక్ ఛప్పన్’ రాగా దీన్ని తెలుగులో ‘సిద్ధం’ అనే సినిమాగా రీమేక్ చేశారు. అటు కన్నడలో ‘ఎన్ కౌంటర్ దయా నాయక్’ ఆ తర్వాత తెలుగులో గోపిచంద్ హీరోగా ‘గోలిమార్’ సినిమా వచ్చింది. ఈ మూవీలో దాదాపు దయా జీవితం గురించి మొత్తం చూపించి... క్లైమాక్స్, ఎండింగ్ సీన్లు కాస్త మార్చేశారు. అదేవిదంగా రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ లో ‘డిపార్ట్ మెంట్’ అనే సినిమా కూడా దయానాయక్ జీవితం ఆధారంగానే తెరకెక్కింది.

పూరి జగన్నాధ్ కు దయా స్టోరీపై చాలా ఆసక్తి ఉండటంతో ‘గోలిమార్’ సినిమాను తెరకెక్కించాడు. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ తో తీసిన ‘బిజినెస్ మెన్’ మూవీలో మహేష్ ను మాపియా హీరోగా చూపించటంతో పాటు.. నాజర్ తో ఉండే ఓ సన్నివేశంలో ‘మళ్ళీ దయా నాయక్ ను దింపకండి సార్.. బాగోదు’ అనే డైలాగ్ ఉంటుంది. అంటే అప్పుడే పూరీ దయాను మళ్ళీ దింపుతానని హింట్ ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఎన్టీఆర్ తో ‘టెంపర్’ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీలో తారక్ పేరు కూడా దయా అని తెలుస్తోంది. ఒకే పోలిస్ స్టోరి ఇప్పటికే చాలాసార్లు సినిమాగా వచ్చినా హిట్ అయింది. అయితే ఒకే డైరెక్టర్ ఒకే కధను రెండు సార్లు సినిమాగా ఎలా చూపించగలడు అనేది ‘టెంపర్’ చూస్తేనే తెలుస్తుంది. ఈ మూవీ దయా నాయక్ రియల్ స్టోరి నేపథ్యంగా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. దీనిపై మూవీ యూనిట్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు.


మహారాష్ర్ట పోలిస్ విభాగంలో పనిచేసే దయానాయక్ సూపర్ పోలిస్ గా ఎదిగాడు. అప్పట్లో రాష్ర్టాన్ని ప్రభావితం చేసిన మాఫియాను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఎనబై ఎన్ కౌంటర్లు చేశాడు. డేంజర్ పోలిస్ గా సంఘ విద్రోహ శక్తులకు వణుకుపుట్టించే ట్రాక్ రికార్డు దయాకు ఉంది. అక్రమాలపై దూకుడుగా వ్యవహరించే ఈయనపై మాఫియాతో లావాదేవీలున్నట్లు ఆరోపణలు రావటంతో గతంలో సస్పెండ్ కూడా అయ్యారు. కేసును విచారించిన ఏసీబీ ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోయింది. దీంతో తిరిగి డిపార్ట్మెంట్ లో చేరారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : temper  ntr  puri jagannath  daya nayak  kajal  

Other Articles