Koratala shiva on sruti hassan issue in mahesh babu movie

koratala shiva next movie, koratala shiva on sruti hassan, koratala shiva mahesh babu movie name, koratala shiva on mahesh babu latest movie shooting, sruti hassan out from mahesh babu movie, tollywood latest gossips, tollywood latest news updates

koratala shiva on sruti hassan issue in mahesh babu movie : mahesh babu latest movie dirctor koratala shiva gives clarity on sruti hassan issue and shooting late problem, shiva koratala quashes all rumors on sruti hassan absence from shooting gives clarity that she will join from december 10th

చాలు గానీ ఇంక ఆపండెహే

Posted: 11/26/2014 07:33 PM IST
Koratala shiva on sruti hassan issue in mahesh babu movie

ఒక్క వార్తను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు తిప్పేసి రాయటంలో తెలుగు మీడియాను ఎవరూ మించలేరు. ఏమి లేకపోయినా అంతా అయిపోయిందన్నట్లు అబద్దపు వార్త కోసం ఆధారాలు చూపేందుకైనా వెనకాడరు. టాలీవుడ్ లో ఈ మద్య తెగ మాట్లాడుకుంటున్న మహేష్ బాబు మూవీ గురించి మన మీడియాలో రోజుకో కథనాలు వస్తున్నాయి. విజయ్ కోసం మహేష్ ను వదిలేసిందనీ.., ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోయిందనీ, శృతి హాసన్ ఏకంగా ప్రాజెక్టు నుంచి తప్పుకుందనీ.., సమంతకు చాన్స్ ఇచ్చి షూటింగ్ కూడా మొదలు పెట్టారని ఇలా వారం రోజులుగా వరుస పెట్టి రూమర్లు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కథనాలతో వాయించేస్తున్నారు.

అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ డైరెక్టర్ కొరటాల శివ ఫుల్ క్లారిటి ఇచ్చేశాడు. శృతి హాసన్ మహేష్ ప్రాజెక్టులోనే ఉందని స్పష్టం చేశాడు. ఈ విషయంలో వస్తున్న పుకార్లన్ని అబద్దమని కొట్టిపారేశాడు. పూణేలో ఇద్దరి మద్య చక్కటి సన్నివేశాలు పూర్తి చేశామని.., మళ్ళీ డిసెంబర్ 10నుంచి షూటింగ్ మొదలవుతుందన్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారయిందని అన్నారు. ఈ పుకార్లను ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియటం లేదు. మహేష్ తో చేసే సినిమాలో శృతి ప్లేస్ లో మరొకరిని హీరోయిన్ గా పెట్టడం లేదు అని ట్విట్టర్ లో చెప్పాడు.

దీంతో ఇంక పుకార్లు రాయుళ్ళ నోళ్ళకు ఫుల్ స్టాప్ పడినట్లే అనుకోవాలి. శృతి అవమానించిది. శృతి తప్పుకుంది.., సమంతా వచ్చేస్తోంది.. అంటూ గాసిప్స్ తో వరుస పెట్టి కథనాలతో ఫ్యాన్స్ ను కలవరపెట్టారు. కొరటాల క్లారిటీతో అదంతా అబద్దమని తేలిపోయింది. డిసెంబర్ 10 నుంచి జరిగే షూటింగ్ షెడ్యూల్ లో పూణేలో కీలక సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. ఈ మూవీ తో కొత్తగా మైత్రి మూవీస్ అనే బ్యానర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మహేష్ పలు జాగ్రత్తలు తీసుకుని నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koratala shiva  sruti hassan  mahesh babu  tollywood  

Other Articles