Ram gopal varma on spot movie

ramgopal varma on spot movie, ramgopal varma latest comments, ramgopal varma spot movie updates, ramgopal varma controversy comments, tollywood latest movies updates

ram gopal varma on spot movie : sensational and controversy director ram gopal varma plans to narrate a character in his latest spot movie, spot will be a new thought of my mind and also will show full of my thought

పైత్యం ముదిరింది.. తెరపై కన్పిస్తాడట

Posted: 11/25/2014 01:14 PM IST
Ram gopal varma on spot movie

వివాదాల డైరెక్టర్ గా పేరున్న రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. ‘స్పాట్’ పేరుతో తీస్తున్న ఈ సినిమాపై వర్మ గారు ఓ ఆడియో సందేశం కూడా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ గురించి ఒక గాసిప్ విన్పిస్తోంది. అదేమంటే.., ఈ మూవీ కోసం సారు వెండి తెరపై కన్పిందుకు సిద్ధమవుతున్నాడు. అంటే ఇన్నాళ్లు వాయిస్ ఇచ్చి, పాటలు పాడి అభిమానులను భయపెట్టిన రామ్ గోపాల్ ఇప్పుడు తెరపై కన్పించి భయపెట్టేందుకు సిద్దమవుతున్నాడన్నమాట.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.., సినిమాకు సంబంధించిన విషయం నేరేట్ చేస్తారని తెలుస్తోంది. ఇక మిగతా విషయాలు చూస్తే.., త్వరలోనే స్పాట్ అనే సినిమా  షూటింగ్ మొదలు కానుంది. అంటే మరో రెండు నెలల్లో మళ్లీ ఓ భయకరమైన  సినిమా టాలీవుడ్ లో విడుదల అవుతుందన్నమాట. ఇక ‘స్పాట్’ అనే పేరు పెట్టడానికి సార్ స్మాల్ వివరణ ఇచ్చారు.  అది ఇలా ఉంది ''స్పాట్‌ అనేది వాడుక భాషలో ఓ మనిషిని చంపడానికి ఫ్యాక్షనిస్టులు పెట్టుకున్న ముద్దు పేరు. ఈ పదం ఎంత సింపుల్‌గా ఉంటుందో... దాని అసలు స్వరూపం చూస్తే అంతగా ఒళ్లు  గగుర్పొడుస్తుంది.

'రక్తచరిత్ర' తీస్తున్నప్పుడు నేను కలిసిన మనుసుల్ని, విన్న విషయాలను నా జీవితంలో మరచిపోలేను. ఆ విషయాలకు 'రక్తచరిత్ర' రెండు భాగాల్లో వంద శాతం న్యాయం చేయలేకపోయాను. దానికి ఒక కారణం రెండు గంటల సినిమాల్లో మహాభారతం లాంటి రక్తచరిత్ర కథను ఎంతని చూపించగలం? ఇంకో ముఖ్య కారణం అప్పుడున్న పరిస్థితుల్లో నాపై పేర్లు చెప్పడానికి వీల్లేని అనేక మంది నుంచి ఒత్తిళ్లు రావడం. 'రక్తచరిత్ర' వెనుక ఉన్న అసలు చరిత్రకు న్యాయం చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ నా మనసును పీకుతూనే ఉంది. మరేం చేద్దామని ఆలోచించిన తర్వాత ఓబుల్‌ రెడ్డి స్పాట్‌ను ఓ అధ్యయనంలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చింది. దీన్నే ఒక సినిమాగా తీయాలని నిర్ణయించాను. 'రక్తచరిత్ర 1' లో 10 నిమిషాలపాటు ఉన్న ఓబుల్‌రెడ్డి హత్య సన్నివేశాన్ని పూర్తి సినిమాగా తీయాలనుకోవడానికి కారణం ఓబుల్‌ రెడ్డికి స్పాట్‌ పెట్టడానికి వెనుక ఉన్న అసలు కారణాల్ని, వ్యక్తుల్ని... స్పాట్‌ పెట్టాక వచ్చిన పరిస్థితుల్ని బయటపెట్టాలనుకోవడమే అని వర్మ చెప్పాడు.  సో తెలుగు ప్రేక్షకులూ.., బీ రెడి టు అలర్ట్.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramgopal varma  spot movie  tollywood  latest news  

Other Articles