Vishal questions sharath about his suspension from nadigar sangam

vishal suspension from nadigar sangam, hero vishal comments on sharath kumar, hero vishal on nadigar sangam, hero vishal comments on radhika, tamilnadu nadigar sangam latest news, hero vishal latest movie updates, koliwood latest news, tollywood latest news updates

vishal questions sharat about his suspension from nadigar sangam : hero vishal fires and questions sharath kumar on removing his name from nadigar sangam. vishal asks sharath to show the proof on allegations against him and also demands to do equal justice for all actors

కోలీవుడ్ పెద్దలతో తాడోపేడో తేల్చుకుంటున్నాడు

Posted: 11/21/2014 12:13 PM IST
Vishal questions sharath about his suspension from nadigar sangam


తెలుగువాడైన విశాల్ తమిళ ఇండస్ర్టీలో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. తమిళనాడు సినిమా కళాకారుల అసోసియేషన్ ‘నడిగర్ సంఘం’లోని పలువురు వ్యక్తులపై విమర్శలు చేసినందుకు ఆయన్ను సంఘం నుంచి తొలగించారు. విశాల్ ను తొలగిస్తూ నడిగర్ సంఘం ప్రసిడెంట్ శరత్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై హీరో విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శరత్ పై సీరియస్ కావటంతో పాటు... పలు ప్రశ్నలతో లేఖను సంధించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు.

లేఖలో విశాల్ పేర్కొన్న అంశాలు.. ప్రశ్నలు ఇవి :

* సస్పెన్షన్ నిర్ణయంతో నేను షాకయ్యాను. నడిగర్ సంఘంలోని వ్యక్తులను గౌరవించే నన్ను ఎలా తొలగిస్తారు.
* నా తొలగింపుపై సంఘం ప్రసిడెంట్ గా మీరు (శరత్ కుమార్) చూపిన కారణాలు వాస్తవం కాదు.
* నాపై ఆరోపణలకు ఆధారాలు చూపండి. అప్పుడు మీరు చెప్పే కారణాలు నిజమని నమ్ముతాను.
* నడిగర్ సంఘంకు చెందిన రాధారవి, కె.ఎన్.కళై నటులపై అసభ్య పదజాలంతో  దూషిస్తే అది మీకు కన్పించదు.
* నటులను ‘కుక్కలు’ అని అసభ్యంగా తిట్టినా వారిపై చర్యలు తీసుకోరు.
* రూల్ 13 ప్రకారం నటుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడే సంఘం సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నా వీరిపై ఎందుకు అమలు చేయరు?.
* ఇదే సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చిన నటుడు కుమారిముత్తును బయటకు పంపించారు.
* పదవులు, హోదాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం ఉండాలన్నదే నా కోరిక.
* కాబట్టి కళై, రాధారవిని కూడా నడిగర్ సంఘం నుంచి తొలగించాలని కోరుతున్నా.

ఇలా ఘాటు మాటలతో సూటిగా శరత్ ను ప్రశ్నిస్తూ తిరుచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లేఖను విడుదల చేశారు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే.., తమిళ ఇండస్ర్టీలో మెయిన్ హీరోల్లో ఒకరిగా ఉన్న విశాల్, కొద్దికాలంగా నడిగర్ సంఘ వ్యవహారాలపై స్పందిస్తున్నాడు. ముఖ్యంగా రాధారవి వంటి వ్యక్తులపై చాలా సీరియస్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే విశాల్ పై ఆగ్రహంగా ఉన్న శరత్.., క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడారని ఆరోపిస్తూ విశాల్ ను తొలగించారు. ప్రస్తుతం కోలీవుడ్ లో జోరుగా నడుస్తున్న ఈ వివాదం ఎటు వెళ్తుందో.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : vishal  nadigar sangam  sharath kumar  radhika  koliwood  

Other Articles