Naga caitanya latest movie title

naga chaitanya latest movie name, naga chaitanya latest movie update, naga chaitanya kriti sanon movie name udates, naga chaitanya sudheer varma movie latest update, hari lo ranga hari for naga chaitanya next movie title, naga chaitanya movie latest news, tollywood latest updates

naga caitanya latest movie title : naga chaitanya latest movie with kriti sanon is with busy schedule here is a gossip around film nagar that movie unit will be hari lo ranga hari but it is yet to announced officially

గుసగుస మళ్ళీ తుస్సుమంది

Posted: 11/20/2014 12:47 PM IST
Naga caitanya latest movie title

యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం సుధీర్ వర్మతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటుందని తెలుస్తోంది. ఈ మూవీకి ఇప్పటివరకు టైటిల్ పెట్టలేదు. చాలా టైటిల్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. గతంలో ‘మాయగాడు’, ‘దొరకడు’ అనే టైటిల్స్ పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాకు ‘హరిలో రంగా హరి’ అనే టైటిల్ పరిశీలించినట్లు ఊహాగానాలు వచ్చాయి.

అయితే ఈ రూమర్లను డైరెక్టర్ సుధీర్ వర్మ ఖండించారు. సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని తెలిపారు. టైటిల్ ఓకే అయితే తామే వెల్లడిస్తామన్నారు. అప్పటివరకు రూమర్లు ప్రచారం చేయవద్దని సుధీర్ కోరారు. హరిలో రంగ హరి టైటిల్ తమది కాదు అని చెప్పారు. ఇది మరొకరి సినిమా టైటిల్ అని చెప్పారు. ‘నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్ పై బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సన్నీ సంగీతం అందిస్తున్నాడు. ఈ మద్యే సినిమాకు సంబంధించి నాగ చైతన్య పొటోను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది.

ఈమూవీలో నాగచైతన్య యాక్షన్ థ్రిల్లర్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైతుకు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు గతంలో హ్యాండ్ ఇచ్చినా.., సుధీర్ వర్మ డైరెక్షన్ కావటంతో ఈ సారి విక్టరీ వరిస్తుందని అంటన్నారు. ‘ఒక లైలా కోసం’ హిట్ కావటంతో తాజా ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఒక లైలా కోసం’ నుంచి కధలను స్వయంగా పరిశీలించి ఎంపిక చేసుకోవటం మొదలు పెట్టడంతో చైతు తాజా మూవీ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  kriti sanon  hari lo ranga hari  tollywood  sudheer varma  

Other Articles