Television anchor pradeep konchem touch lo unte chepta show tamanna bhatia interview telecast news

tamanna bhatia, anchor pradeep, tamanna hot photos, telugu anchor pradeep news, konchem touch lo unte chepta show, konchem touch lo unte chepta tamanna bhatia

television anchor pradeep konchem touch lo unte chepta show tamanna bhatia interview telecast news

తమన్నాతో పనైపోయిందంటున్న యాంకర్!

Posted: 11/15/2014 07:17 PM IST
Television anchor pradeep konchem touch lo unte chepta show tamanna bhatia interview telecast news

బుల్లితెరపై యాంకర్ గా రాణించాలంటే అంత సులభమైన విషయం కాదు. ఆ వృత్తిలో కొనసాగాలంటే డెడికేషన్, సిన్సియారిటీ, నాలెడ్జ్ తోపాటు మంచి వాక్చాతుర్యాన్ని కలిగి వుండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు తడబడకుండా.. మాటల్లో తేడాలు లేకుండా స్పష్టంగా మాట్లాడే ట్యాలెంట్ తప్పనిసరి! అప్పుడే యాంకర్ గా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలరు. అలా గుర్తింపు తెచ్చుకున్నవారిలో ఓంకార్ మొదటిస్థానంలో వుండగా.. ఆయనలాగా ఫేమస్ అయిన మరో యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అప్పుడప్పుడు స్టేజీ షోలు, సాధారణ షోలలో యాంకర్ గా కొనసాగిస్తూ వచ్చిన ప్రదీప్... నేడు ఆ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని, సొంతంగా లైవ్ షోలు నిర్వహించుకునే స్థాయికి ఎదిగాడు.

ఇక అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం ‘కొంచెం టచ్ లో వుంటే చెప్తాను’ అనే పాపులర్ టీవీ షోను నిర్వహిస్తున్న ప్రదీప్.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లను, ఇతర నటులను ఆహ్వానించాడు. అందరితోనూ సరదాగా వుంటూ వారి పర్సనల్ లైఫ్ విషయాల గురించి అందరికీ తెలియపరిచాడు. ఎవ్వరితోనూ తడబడకుండా తన యాంకరింగ్ ట్యాలెంట్ ను నిరూపించుకోగలిగాడు. అయితే మిల్కీబ్యూటీ తమన్నాను ఆహ్వానించేటప్పుడు మాత్రం కాసింత టెన్షన్ పడ్డానని చెబుతున్నాడు ప్రదీప్! ఎందుకంటే.. స్టార్లందరూ తమతమ మూవీ షూటింగులతో నిత్యం బిజీగా వుంటారు. అటువంటివాళ్లను ఇలాంటి బుల్లితెర షోలకు ఆహ్వానిస్తే మొదట్లో ఓకే అంటారు కానీ.. చివరి నిముషంలో తమ మూవీ షెడ్యూల్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయి రానని హ్యాండిస్తే అంతే సంగతులు! ఆ సయమయంలో ఎనలేని టెన్షన్ పడాల్సి వస్తుంది. షోను నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. కాబట్టి.. స్టార్ల షెడ్యూల్ సంగతిని దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది.

తమన్నా వ్యవహారంలో కూడా ఇలా ఆలోచించాల్సి వచ్చింది. అన్ని భాషల చిత్రాల్లో వరుసగా నటిస్తూ బిజీగా వున్న ఆమె.. ఎక్కడ రాకుండా హ్యాండిస్తుందోనని తెగ భయపడిపోయాను. అయితే ఏదో ఒక విధంగా కష్టపడి త్వరలోనే తమన్నాతో ఎపిసోడ్ ను పూర్తి చేశాం. చివరి నిముషంలో ఏమవుతుందా అని భయపడ్డానుగానీ.. ఎలాగోలా ఆమెతో పనైపోయిందని అంటున్నాడు యాంకర్ ప్రదీప్! ఇదివరకే తమన్నాతో ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రదీప్ వచ్చేవారం ఆ షోను టెలికాస్ట్ ప్రసారం చేయనున్నామని తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles