Pawan kalyan venkatesh gopala gopala movie sankranti festival movie race

pawan kalyan, pawan kalyan gopala gopala, pawan kalyan latest news, pawan kalyan venkatesh movie, pawan kalyan latest news, gopala gopala movie news, gopala gopala movie release date, gopala gopala movie review, sriya saran news

pawan kalyan venkatesh gopala gopala movie sankranti festival movie race : according to the film industry news... pawan kalyan and venkatesh multistarrer movie may not release in sankranti festival due to some patch work of pawan krishna avatar and other scenes

‘సంక్రాంతి పండుగ’నాడు పవన్ బ్యాడ్ న్యూస్!

Posted: 11/15/2014 04:42 PM IST
Pawan kalyan venkatesh gopala gopala movie sankranti festival movie race

‘అత్తారింటికి దారేది’ సినిమా తర్వాత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేవలం ప్రచారాలకే పరిమితం కావడం వల్ల పవన్ కల్యాణ్ కు సినిమాల్లో నటించేందుకు వీలు దొరకలేదు. దాదాపు రెండేళ్లపాటు ఆయన సిల్వర్ స్ర్కీన్ మీద కనిపించలేదు. దీంతో పవన్ తర్వాతి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంతలోనే వెంకీ - పవన్ కాంబినేషన్ లో ‘గోపాల గోపాల’ సినిమా వస్తోందని వార్తలు విన్న అనంతరం అందరూ సంతోషించారు కానీ.. ఇంకా ఈ సినిమా విడుదలపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోడంతో అందరూ అసహనంతో వున్నట్లు సమాచారం! ఇప్పటికే సుమారు 6 నెలలు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి ఇంకా ఫస్ట్ లుక్ కాదు కదా.. అదికారికంగా ఎటువంటి వార్తలు వెలువడటం లేదు. దీంతో ఈ చిత్రం విడుదల విషయం ఆసక్తికరంగా మారింది.

నిజానికి ‘గోపాల గోపాల’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని యూనిట్ వర్గాలు ప్లాన్ వేసుకున్నారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం విడుదల ఆలస్యం అయ్యే సూచనలు చాలావరకు వున్నాయని కనిపిస్తున్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం జరుగుతున్నట్టు ఇండస్ట్రీవర్గాల నుంచి సమాచారాలు వస్తున్నాయి. ఇంకా ఈ మూవీ షూటింగుకు సంబంధించి ఇరవైరోజుల వర్క్ బ్యాలెన్స్ గా వుందని.. అందులో పవన్ వర్క్ కూడా వుందని యూనిట్ వర్గాల సమాచారం. అలాగే, పవన్ కృష్ణుడి పాత్రకు చెందిన సీజీ వర్క్ కు కూడా మరింత సమయం అవసరం అవుతుందని వాళ్లు పేర్కొంటున్నారు. ఇటువంటి కారణాల వల్ల ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టేనని అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  venkatesh  gopala gopala movie  sriya saran  sankranti festival  telugu news  

Other Articles