Salman khan to face bigboss show problems from hyderabad during sister marriage

slalman khan case, salman khan bigboss tv show case, salman khan bigboss dog issue case, salman khan sister marriage, salman khan latest news, tollywood latest news, bollywood latest news, big boss tv show updates, dogs images, breed dogs to buy

salman khan to face bigboss show problems from hyderabad during sister marriage : salman khan still facing problems by his bigboss show a modh fasimoddin alleges that salman shows a dog in tv show and says it is heaven, these type of comparisions hurts feelings of muslims so asking to question salman when he comes to hyderabad for sister marriage

చెల్లి పెళ్ళి వేళ ఇదో లొల్లి

Posted: 11/14/2014 12:13 PM IST
Salman khan to face bigboss show problems from hyderabad during sister marriage

బాలీవుడ్ బాడీ బిల్డర్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు వార్తల్లో కూడా ఎక్కువగా ఉండటం తెలిసిందే. నిత్యం ఏదో ఒక విషయంతో మీడియా నోట్లో నానుతుండటం సల్లుభాయ్ కు అలవాటే. తాజాగా చెల్లి పెళ్ళి సమయంలో కూడా ఆయనపై మీడియా ఫోకస్ పెట్టింది. అటు ఖాన్ హైదరాబాద్ కు వస్తే ఇబ్బందులు తప్పవని ఓ వ్యక్తి సవాల్ చేస్తున్నాడు. గతేడాది వచ్చిన టీవీ షో ‘బిగ్ బాస్’లో సల్మాన్ ఓ కుక్కను స్వర్గంగా చూపించాడని ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఫసీయుద్ధీన్ ఆరోపిస్తున్నారు.

హైదర్ గూడలో గురువారం లాయర్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఫసీయుద్ధీన్, ఈ వ్యవహారంపై కేసు పెట్టాలని తాను గతంలోనే బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలిసులు పట్టించుకోలేదన్నారు. అయితే తాజాగా చెల్లి పెళ్లి కోసం సల్మాన్ హైదరాబాద్ లోని ఫలక్ నమా ప్యాలెస్ కు వస్తున్న నేపథ్యంలో ఆయన్ను విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సారి పోలిసులు స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈనెల 16న పీస్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

సల్మాన్ తో పాటు షోలో నటించిన సైఫ్ అలీ ఖాన్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఫసీయుద్ధీన్ డిమాండ్ చేశారు. తమ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి చొరవ తీసుకుని చర్యలకు ఆదేశించాలని కోరారు. ఇప్పటికే పలు వివాదాలు సల్మాన్ ను చుట్టుముట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నాయి. దీనికి తోడు మరో కొత్త వివాదం తోడయింది. సంతోషంగా పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో, సల్లూకు ఇదో సవాల్ గా మారింది. పెళ్లి సమయంలో విచారణలు జరిగితే ఎలా అని  అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  bigboss  dog show  latest news  

Other Articles