Anjali have more chances in koliwood than tollywood

anjali movies in koliwood, anjali movies in koliwood, anjali next movie in tollywood, anjali latest hot photos, tollywood latest updates, telugu movies in 2014

anjali have more chances in koliwood than tollywood : rajamundry based actress anjali have less chances in tollywood when it compares with koliwood.

పుట్టినింట్లో పట్టించుకోవటంలేదు

Posted: 11/13/2014 12:57 PM IST
Anjali have more chances in koliwood than tollywood

పొరుగింటి పుల్లకూర చాలా రుచి అన్నట్లుగా.., టాలీవుడ్ కు తెలుగు హీరోయిన్లు నప్పరు. అదే ముంబై నుంచి వచ్చిందంటే ముడతల మొహమైనా కళ్లకు అద్దుకుని కెమెరాలు ఆన్ చేస్తారు. ఇలా ఎందుకు అంటున్నామంటే.., తెలుగమ్మాయి అంజలికి టాలీవుడ్ లో అవకాశాలు తక్కువగా ఉన్నాయట. ఈ అమ్మడికి తెలుగు కంటే, కోలీవుడ్ లో ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి. ఈ మద్య వచ్చిన ‘గీతాంజలి’ హిట్ అయినా.., అంజలికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావటం లేదు

అంజలి మొదటగా తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడి నుంచి తెలుగుకు వచ్చింది. ఇక్కడ కొత్తలో మోస్తరుగా సినిమా చాన్సులు వచ్చాయి. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల కాస్త ఇబ్బంది పడింది. దీంతో టాలీవుడ్ లో గ్యాప్ ఏర్పడింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తాజాగా ‘గీతాంజలి’ హిట్ అయినా చాన్సులు మాత్రం రావటం లేదు. దీంతో తిరిగి తమిళ ఇండస్ర్టీనే నమ్ముకుంది. చెన్నైకి వెళ్ళటంతోనే ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. ప్రస్తుతం జయం రవి హీరోగా వస్తున్న సినిమాలో అంజలి నటిస్తోంది.

మరోవైపు విమల్ తో ముచ్చటగా మూడవ సినిమా చేస్తోంది. దీంతో పాటు మరో తమిళ సినిమాకు కూడా అంజలి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని ప్రాజెక్టులు పరిశీలన దశలో ఉన్నాయని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. తెలుగమ్మాయిని తెలుగు ఇండస్ర్టీ పట్టించుకోవటం లేదని బాధపడాలా... లేక మన అంజలికి తమిళ పరిశ్రమ మంచి ఆఫర్లు ఇస్తోందని సంతోష పడాలా తెలియటం లేదు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anjali  tollywood  koliwood  movies  

Other Articles