Karthikeya movie to remake in tamil

karthikeya movie latest news, karthikeya movie collections, karthikeya review and rating, karthikeya remake in tamil, karthikeya tamil version release date, tollywood latest news updates, koliwood latest news updates

karthikeya movie to remake in tamil : hero nikhil career first big hit movie karthikeya to remake in tamil by same combination of producer and hero. producer clarified on karthikeya dubbing in tamil and says that he is going to remake movie in koliwood with nikhil

నిఖిల్ కోసం కార్తికేయ మళ్ళీ తీస్తున్నారు

Posted: 11/12/2014 12:23 PM IST
Karthikeya movie to remake in tamil

టాలీవుడ్ లో ఈ మద్య కాలంలో చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అంటే ‘కార్తికేయ’ అనే చెప్పాలి. 20రోజుల్లో ఈ మూవీ 20కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. విజయ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగులో హిట్ కొట్టిన ఈ మూవీని తమిళంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు విడుదల సమయంలోనే తమిళ డబ్బింగ్ విడుదల కూడా ఉంటుందని సినిమా యూనిట్ వర్గాలు గతంలో తెలిపాయి. ఈ దిశగా డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే పలు కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది.

అటు ఈ మూవీని తమిళంలో తన కొడుకుతో రీమేక్ చేయించాలన్న ఆర్.బీ. చౌదరి కల ఫలించలేదు. రీమేక్ హక్కుల కోసం నిర్మాతను సంప్రదిస్తే వెంకట శ్రీనివాస్ నో చెప్పాడట ఇందుకు బలమైన కారణం ఉంది అదేమంటే.., తమిళ ఇండస్ర్టీకి నిఖిల్ ను పరిచయం చేస్తానని నిర్మాత వెంకట శ్రీనివాస్ మాట ఇచ్చాడట. అందుకే రీమేక్ హక్కులు ఇవ్వకుండా నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. దీంతో చౌదరి ఆశలు అడియాశలుగా మిగిలాయి. అటు త్వరలోనే ఈ మూవీ తమిళంలో డబ్బంగ్ విడుదల కానుంది.

మాగ్నస్ ప్రైమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ‘కార్తికేయ’ సినిమా నిఖిల్ కెరీర్ లో తొలి వ్యక్తిగత భారీ హిట్ అని చెప్పవచ్చు. చందు మండేటి డైరెక్షన్ లో వెంకట శ్రీనివాస్ ఈ మూవీని నిర్మించారు. స్వాతి, నిఖిల్ లకు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. కలెక్షన్లు, శాటిలైట్ హక్కులు, ఓవర్ సీస్ ఇలా అన్ని వైపుల నుంచి కలుపుకుని రూ.25కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ కు ఇది పెద్ద హిట్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karthikeya  tamil remake  latest news  tollywood  

Other Articles