అనుష్క లేటెస్ట్ మూవీ ‘రుద్రమదేవి’ విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ మూవీని డిసెంబర్ మూడవ వారంలో విడుదల చేయాలి అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. ముఖ్యంగా ఎడిటింగ్, గ్రాఫిక్స్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా సినిమాను అనుకున్న సమయంలో విడుదల చేయలేము అని యూనిట్ భావిస్తోంది. ఇక డిసెంబర్ నాల్గవ వారంలో హడావుడిగా విడుదల చేసే బదులుగా, పనులు పూర్తిగా క్వాలిటీతో చేసుకుని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుందని ముందుగా ఊహించే, షూటింగ్ జరుగుతుండగానే కొన్ని విభాగాల పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం అయింది. డబ్బింగ్ పనులు కూడా షూటింగ్ పూర్తవగానే వేగవంతం చేశారు. అయితే భారీ గ్రాఫిక్స్, ఎఫెక్టుల వల్ల ఆలస్యం జరుగుతోంది. ఎంతో కష్టపడి తీసిన సినిమాకు అంతకంటే ఎక్కువ కష్టపడి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఈ తుది మెరుగులు దిద్దితే సినిమా పూర్తయినట్లే.
దాదాపు 9సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి మరి సినిమాను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ గుణశేఖర్ ఈ ప్రాజెక్టు కోసం భారీగా డబ్బులు ఖర్చుపెడుతున్నారు. దాదాపు యాబై కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దేశంలోనే తొలిసారిగా స్టీరియో స్కోపిక్ తో ‘రుద్రమదేవి’ 3డీలో షూట్ చేశారు. ప్రత్యేకంగా నగలు డిజైన్ చేయించటంతో పాటు, భారీ సెట్టింగులు వేసి షూటింగ్ చేశారు. ఈ మూవీ కథ తెలంగాణకు సంబంధించినది కావటంతో ఆ రాష్ర్టంలో పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు.
అనుష్క లీడ్ రోల్ గా వస్తున్న లేడి ఓరియంటెడ్, హిస్టారిక్ మూవీ ఇది. ఈ ప్రాజెక్టు అరుంధతి కంటే పెద్దహిట్ అవుతుందని సినీ ప్రముఖులు చెప్తున్నారు. అనుష్కతో పాటు రానా ప్రధాన పాత్రలో ఉన్నారు. అటు అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య క్యారెక్టర్లు పోషిస్తున్నారు. హిస్టారికల్ ప్రాజెక్టుకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. నాటి రుద్రమ వీరనారిగా నిలిస్తే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఈ రుద్రమదేవి పోటిలో ఉన్న సినిమాలతో ఏ మేరకు యుద్ధం చేస్తుందో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more