Hansika motwani giving suggestions to girls and ladies on harassements situations

hansika motwani, hansika motwani news, hansika motwani latest news, hansika motwani hot photos, hansika motwani interview, hansika motwani press meet, hansika hot photo shoot, hansika gallery

hansika motwani giving suggestions to girls and ladies on harassements situations

అమ్మాయిలకు హన్సిక సలహా..

Posted: 11/04/2014 10:17 AM IST
Hansika motwani giving suggestions to girls and ladies on harassements situations

భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ప్రపంచపటంలో ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ముందుకు సాగుతున్నప్పటికీ... సమాజంలో అమ్మాయిలకు మాత్రం ఇంకా దక్కాల్సిన అర్హత లభించడం లేదు. విదేశాల్లో పురుషులకంటే మహిళలు అన్ని విభాగాల్లో దూసుకుపోతుంటే.. మన దేశంలో మాత్రం ఇంటినుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇంటినుంచి బయటికి వెళితే తిరిగి ఇంటికి వెళ్లగలమా..? లేదా..? అనే అయోమయంలో మునిగిపోతున్నారు ఇక్కడి మహిళలు! ఎందుకంటే.. ఎవరు, ఎప్పడు, ఎలా వచ్చి తమను అత్యాచారం చేస్తారా..? అన్న భయం ఇంకా పెరుగుతూనే వుంది కానీ.. తగ్గడం లేదు. గతంతో పోల్చుకుంటే అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే వుంది కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ఈ సంఖ్య రానురాను మరింత పెరుగుతుండడంతో ఇప్పటికే దేశానికి అత్యాచారాల దేశంగా పేరు కూడా వచ్చింది.

ఇదే విషయమే సినీ నటి హన్సిక అమ్మాయిలకు కొన్ని సలహాలను అందిస్తోంది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఈమె స్పందిస్తూ.. ‘‘ఈ విషయాలను తలచుకొన్నప్పుడల్లా మనసు బరువెక్కిపోతోంది. ఎవరిని నమ్మాలో అర్థంకాని పరిస్థితుల్లో వున్నాం. ఇందులో ప్రత్యేకించి ఎవరిని నిందించలేం... వీటన్నింటికీ మనమంతా బాధ్యులమే! అయితే మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. స్వీయ రక్షణ మార్గాలు వెతుక్కోవాలి. బయటకు ఎక్కడికెళ్లినా, ఎప్పుడెళ్లినా తల్లిదండ్రులకు చెప్పి వెళ్లడం ఎంతో శ్రేయస్కరం’’ అని అంటోంది అమ్మడు. అలాగే మాట్లాడుతూ.. ‘‘మహిళలు ఎవరికాళ్లపై వాళ్లు నిలబడగలగాలి. ముఖ్యంగా అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఇదెంతో అవసరం’’ అంటోంది ఈ బొద్దుగుమ్మ.

‘‘మరి ఇటువంటి పరిస్థితులు కూడా పరిశ్రమలో వున్నాయా..? ఆడ, మగ అనే లింగభేధాలున్నాయా..?’’ అన్నప్రశ్నలకు బదులుగా సమాధానమిస్తూ.. ‘‘ఈ విషయంలో మేమంతా అదృష్టవంతులమే. కథానాయికలకు ఇక్కడ బాగానే గౌరవం దక్కుతోంది. కొన్ని విజయాలు సాధిస్తే వాటితోపాటే సమాన హోదా ఇస్తున్నారు. మేమంతా ఎక్కడినుంచి వచ్చినా.. మనకంటూ ఒక స్థానాన్ని పరిశ్రమలో ఏర్పరుచుకోవచ్చు’’ అని పేర్కొంది హన్సిక! ఇటీవలే ‘‘పవర్’’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అందాలబొమ్మ.. ప్రస్తుతం తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika motwani  women harassements  rapes india  telugu news  tollywood news  

Other Articles