Kaththi story murugadoss and gopi controversy latest updates

kaththi movie latest news, kaththi story controversy, gopi allegations on murugadoss kaththi, kaththi movie issues, case on murugadoss, koliwood latest updats, koliwood media, telugu media news, vijay next movie

kaththi story murugadoss and gopi controversy latest updates : kaththi movie still have problems it now facing defamation cases and re cases assistant director gopi alleged that kaththi movie story is of him but murugadoss copied from him. murugadoss serious with his assistant director gopi allegations and wants to file case on him

బాబోయ్ : ‘కత్తి’కి కొత్త కష్టాలు

Posted: 11/01/2014 10:45 AM IST
Kaththi story murugadoss and gopi controversy latest updates

ఈ మద్య వచ్చిన ఏసినిమాకు కూడా ఇన్ని ఇబ్బందులు రాలేదనుకుంటా. షూటింగ్ సమయం నుంచి మొదలు పెడితే ప్రతీది వివాదమే. నిర్మాణం, విడుదల, తెలుగు రీమేక్, సినిమాలో సన్నివేశాలు, తాజాగా కథ ఇలా ప్రతి అంశం కూడా కత్తికి కత్తిమీద సాములా మారుతోంది. ఈ సినిమాకు తాజాగా కధ కష్టాలు వచ్చాయి. అంటే క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న మురుగదాస్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అయితే కధ తన నుంచి కాపి కొట్టారని మురుగ దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ గోపి కొత్త సంచలనానికి తెరలేపాడు.

ఈ కథ మురుగ తననుంచి కాపి కొట్టాడని చెప్పటమే కాదు.., పలు తమిళ మీడియా సంస్థలతో ప్రత్యేక ఇంటర్వ్వూలు, లైవ్ డిబేట్లు జరిపారు. ఈ సందర్బంగా తాను రాసుకున్న కధను ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్టర్ వాడుకున్నారు అని గోపి ఆరోపించారు. ప్రస్తుతం కోలివుడ్ లో దీనిపై రచ్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజా ఆరోపణలపై ‘కత్తి’ యూనిట్ సీరియస్ గా ఉంది. ముఖ్యంగా మురుగదాస్ అయితే గోపిపై చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. సొంతంగా కొత్తదనంతో ఉండే కథలు రాసి, సినిమా తీయటంలో మురుగదాస్ కు ప్రత్యేకత ఉంది. అలాంటి వ్యక్తిపై కాపి కొట్టాడు అని ఆరోపించటంపై తీవ్రంగా మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.

ఒకవేళ కథ లేకపోతే గోపి నుంచి కధ కొనలేనంత స్థాయిలో డైరెక్టర్ లేరు. మరి వివాదం అవుతుందని తెలిసి కూడా ఎందుకు ఆయన ఇలాంటి పని చేస్తారు అని ప్రశ్నలు వస్తున్నాయి. ‘కత్తి’ కథకు సంబంధించి అన్ని ఆధారాలు సిద్దం చేసుకున్న డైరెక్టర్ గోపిపై కేసు వేస్తాడని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మురుగదాస్ కు పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు కూడా మద్దతు ప్రకటించారు. మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సినిమా యూనిట్ పై ఓ కేసు ఉంది. తాజాగా ఇదో కేసు అవుతుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaththi  murugadoss  gopi  latest news  

Other Articles