Small screen comedy king kapil sharma out from varma serious movie for karan johar

ram gopal varma, kapil sharma, ram gopal varma twitter, kapil sharma twitter, ram gopal varma movies, kapil sharma comedy nights with kapil show, comedy nights with kapil, comedy nights show, kapil sharma latest news, director karan johar, serious movie, abbas mastan directors

small screen comedy king kapil sharma out from varma serious movie for karan johar

‘‘సీరియస్’’.. వర్మను పక్కకు నెట్టేసిన స్టార్ కమెడియన్!

Posted: 10/31/2014 09:04 PM IST
Small screen comedy king kapil sharma out from varma serious movie for karan johar

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యాలతో వార్తల్లోకెక్కే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎన్నడూలేని విధంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. రాజకీయనాయకులు, సినీప్రముఖులు, వ్యాపారవేత్తలు, చిన్నచిన్న ఆర్టిస్టులతో సైతం ఎవ్వరినీ వదలకుండా తన పంచ్ డైలాగులతో వారందరినీ ఉక్కిరిబిక్కిరి చేసే వర్మ.. ఒక స్టార్ కమెడియన్ చేతిలో పరాభావం ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఆ స్టార్ కమెడియన్ వర్మను ఖాతరు చేయకుండా పక్కకు పడేశాడని.. మరి దీనిపై వర్మ స్పందన ఎలా వుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. వర్మ ఇప్పటివరకు బాలీవుడ్ బిగ్ బీతో పాటు ఎందరో స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. ఇప్పుడు కూడా ఈయన సినిమా తీయడానికి రెడీ అంటే స్టార్ హీరోలందరూ క్యూలో నిలబడతారు. ఎందుకంటే.. ఆయనతో తీసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కాకపోయినా.. దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. అటువంటి డైరెక్టర్ అయిన వర్మతో కలిసి ఓ సినిమాలో పనిచేయడానికి స్టార్ కమెడియన్ తిరస్కరించాడు. అతనెవరో కాదు... ‘‘కామెడీ నైట్స్ విత్ కపిల్’’ షోకు యాంకర్, నిర్మాతగా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ! తన ప్రతిభతో రాత్రికిరాత్రే స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన ఇతను.. ప్రస్తుతం తన షో మీదే ఎక్కువ దృష్టి సారించి, వచ్చిన సినిమా అవకాశాలను తిరస్కరిస్తూ వస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ షోకు మంచి పేరుండటంతో ఇప్పటికే ఎన్నో క్యారెక్టర్ రోల్స్ ఆఫర్స్ ను పక్కనపడేశాడు ఈ కమెడియన్!

kapil-sharma-photos

ఇదిలావుండగా... గతంలో కమెడియన్ కపిల్ శర్మ సంచలన దర్శకుడు వర్మతో కలిసి పనిచేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సినిమాపేరు కూడా ‘‘సీరియస్’’గా ఖరారు చేశారు. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వీరిద్దరి మూవీ వచ్చే ఏడాది జనవరి నుంచి ఆరంభం కావాల్సి వుంది. అయితే తాజాగా మనోడు వర్మకు గట్టి షాకే ఇచ్చాడు. అతను ఆ సినిమా నుంచి తప్పకున్నాడు. ఇప్పటికే అబ్బాస్-మస్తాన్ చిత్రానికి కమిట్ అయిన కపిల్.. ఆర్జీవిలాంటి సంచలన దర్శకుడు ఆఫర్ ను ఎందుకు తిరస్కరించాడో జనాలకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే బాలీవుడ్ సూపర్ డైరెక్టర్ అయిన కరణ్ జోహర్ తో ఇతను ఓ సినిమా చేయబోతున్నాడని.. ఆ మూవీ కూడా వర్మ తీయబోయే చిత్రం సమయంలోనే రిలీజ్ అవుతుందని సమాచారం!

అంటే వర్మ, కరణ్ ఇద్దరు దర్శకులు తెరకెక్కించబోయే సినిమాల్లో కపిల్ నటించడానికి ఒప్పుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాలు త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని ఒకేరోజు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం! అంటే.. ఇతనికి సంబంధించిన రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతాయన్నమాట! ఆ విషయం తెలుసుకున్న మనోడు.. కరణ్ జోహర్ లాంటి దర్శకుడితో క్లాష్ పెట్టుకుంటే తనకే నష్టం వస్తుందని.. అందుకే వర్మ సినిమాను పక్కన పెట్టేశాడని సమాచారం! అయితే ఈ విషయంపై వర్మ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  kapil sharma  karan johar  serious bollywood movies  abbas mastan  telugu news  

Other Articles