Nandamuri balakrishna latest movie title may be fixed as lion

nandamuri balakrishna, balakrishna latest news, balakrishna movie news, balakrishna movie, balakrishna lion movie, balakrishna lion movie news, lion telugu movie, director satyadeva, trisha latest news, trisha hot photos, trisha hot gallery, trisha photos

nandamuri balakrishna latest movie title may be fixed as lion

‘‘ఆంగ్ల’’భాషలో గర్జిస్తానంటున్న బాలయ్య!

Posted: 10/28/2014 04:38 PM IST
Nandamuri balakrishna latest movie title may be fixed as lion

‘‘లెజెండ్’’ సినిమాతో సరికొత్త రికార్డులను తన ఖాతాలో జమచేసుకున్న నందమూరి బాలకృష్ణ హీరోగా నూతన దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. కానీ... ఈ చిత్రం టైటిల్ విషయంలో దర్శకనిర్మాతలు ఇంకా కసరత్తు చేస్తూనే వున్నారు. గతంలో ఈ సినిమాకు రకరకాల పేర్లు పరిశీలించారు గానీ.. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు ఏవీ లేవంటూ వాటిని పక్కన పెట్టేశారు.

ఈ నేపథ్యంలో ‘‘గాడ్సే’’, ‘‘వారియర్స్’’ అనే టైటిళ్లలో ఏదో ఒకదానిని నిర్ణయించుకుని ఖరారు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే చిత్రవర్గాలు ఈ టైటిళ్లను ఆమోదముద్ర వేయకపోవడంతో పక్కనపెట్టేశారని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘‘లయన్’’ అనే టైటిల్ చాలా బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం! గత సినిమాల సెంటిమెంట్ దృష్ట్యా బాలకృష్ణ కూడా ఈ టైటిల్ వైపే మొగ్గుచూపే అవకాశాలు చాలావరకు వున్నాయని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. గతంలో వచ్చిన ‘‘సింహా’’ చి్రం మంచి విజయం సాధించడంతో ఆ టైటిల్ నే కాస్త ఆంగ్లంలో ‘‘లయన్’’గా టైటిల్ ఖరారు చేస్తే బాగుంటుందనే ఆలోచన దృష్ట్యా ఈ టైటిలే ఫైనల్ కావచ్చని విశ్లేషకుల అభిప్రాయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandamuri balakrishna  balakrishna new movie title lion  trisha  tollywood news  

Other Articles