Ileana reveals her feelings on marriage issue

ileana, ileana latest news, ileana hot photos, ileana hot gallery, ileana latest photo shoot, ileana latest photo gallery, ileana marriage news

ileana reveals her feelings on marriage issue

అమ్మో ఇల్లీ! దాచుకున్న రహస్యాలన్నీ లీక్ చేసింది!

Posted: 10/27/2014 06:45 PM IST
Ileana reveals her feelings on marriage issue

సాధారణంగా హీరోయిన్లు తమ రహస్యాలను పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా పెళ్లి గురించి అయితే మరీను! మూడుపదుల వయస్సు దాటినా.. ఇంకా ఇప్పుడు పెళ్లెందుకు..? అంటూ మొహం చాటేస్తుంటారు. నిన్నటివరకు ఇలియానా పరిస్థితి కూడా అంతే! ఎప్పుడైనా తనముందు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే చాలు.. పరోక్షంగా తన కోపాన్ని ప్రదర్శించేది లేదా అప్పటికప్పుడే మాట మార్చేసేది. కానీ ఇప్పుడు అలా కాదు.. పెళ్లికి సంబంధించి ఈ అమ్మడు చాలా విషయాలే వెల్లడిస్తోంది. అనుకోకుండా ఈ అమ్మడు ఇలా పెళ్లి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడంతో చిత్రపరిశ్రమలో ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు.

ముక్కు-ముఖం తెలియని ఇద్దరు వ్యక్తుల అభిరుచులు, మనస్తత్వం తెలియకుండా ఒకటై జీవితాంతం ఎలా ఉంటారని ఒకప్పుడు అనుకునేదానినని.. ఇలా థింక్ చేయడంవల్లే పెళ్లంటే తనకు అసహ్యంగా ఉండేదని ఇల్లీ తెలిపింది. కానీ ఇప్పుడు అది ఇష్టంగా మారుతోందని, వయసు పెరిగే కొద్దీ జీవితం అంటే ఏంటో తెలుస్తుందని, మ్యారేజ్‌లపై ఇప్పుడిప్పుడే తనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుందని ఈ గోవాబ్యూటీ అంటోంది. అలా ఆవిధంగా తనకు పెళ్లి మీద మంచి అభిప్రాయం ఏర్పడిందని, ఇందులో ఏదో కొత్త ఎట్రాక్షన్ వుందంటోంది ఈ సన్నజాజి నడుముపిల్ల. పెళ్లి మీద తనకు ఇన్నాళ్లున్న నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని మార్చేసుకున్నానంటూ వెల్లడించింది.

ఇల్లీ ఈ విధంగా కామెంట్ చేయడంతో మొదట్లో అందరూ షాకయ్యారు గానీ.. మొత్తానికి వివాహబంధంపై వున్న లోగుట్టునైతే తెలుగుకోగలిగిందంటూ చెప్పుకుంటున్నారు. అంతాబాగానే వుంది కానీ.. తాను ఇంతకీ ఎవరితో పెళ్లి చేసుకుంటుందనే విషయాన్ని మాత్ర వెల్లడించకుండా సస్పెన్స్ గానే పెట్టేసింది. అయితే గతకొన్నాళ్లుగా ఆస్ర్టేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో డేటింగ్ చేస్తూ వచ్చిన ఈమె, అతడినే పెళ్లి చేసుకుంటోందని ప్రచారం సాగింది. కానీ, అతను కేవలం ఫ్రెండ్ మాత్రమేనని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిందామె! మరి పెళ్లిమీద ఇంత మంచి అభిప్రాయాన్ని వెల్లడించిన ఈమె ప్రియుడు ఎవరో.. ఎవర్ని పెళ్లి చేసుకుంటుందోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ileana  goa beauties  celebrities marriages  telugu news  

Other Articles