Nitya menon got two big movie offers director maniratnam trivikram allu arjun combination movie

nitya menon news, nitya menon movies, nitya menon movie news, nitya menon latest photo shoot, nitya menon hot photo shoot, nitya menon movie updates, nitya menon movies, nitya menon wiki, nitya menon child artist, nitya menon maniratnam movie, trivikram allu arjun movie, tollywood news, telugu news

nitya menon got two big movie offers director maniratnam trivikram allu arjun combination movie

నిత్యా జీవితంలో మలుపుతిరిగిన శుభవేళ!

Posted: 10/25/2014 03:11 PM IST
Nitya menon got two big movie offers director maniratnam trivikram allu arjun combination movie

‘‘అలా మొదలైంది’’ సినిమా ద్వారా తెలుగుచలన చిత్రపరిశ్రమలో అడుగులు వేసిన ఈ భామ.. తన బుంగమూతి యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇతర తారలకంటే భిన్నంగా తన హావభావాలను వ్యక్తపరుస్తూ, బొద్దుగా నటించే ఈ అమ్మడు.. ఆ మొదటిచిత్రం ద్వారా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఈ అమ్మడికి మొదట్లో బాగానే అవకాశాలొచ్చాయి. ఆ మూవీలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లనే రాబట్టాయి. అయితే భారీ ఆఫర్లు మాత్రం ఈ అమ్మడు చెంతకు రాలేదు. కానీ అప్పట్లో వచ్చిన ఒక పెద్ద ప్రాజెక్టును తన నోటిదురుసుతో పోగొట్టుకుంది కానీ.. తర్వాత తాను చేసిన తప్పేమిటో తెలుసుకుని సైలెంట్ అయిపోయింది. అయినాగానీ ఈ అమ్మడికి తెలుగులో అంతగా ఆఫర్లు రాలేదు. దాంతో కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో అరకొర సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతోంది.

అయితే ప్రతిఒక్కరి జీవితంలో ఏదో ఒకరోజు అదృష్టం తలుపు తడుతుంది అన్న మాటలు ఇక్కడ ఈ అమ్మడికి బాగానే సూట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒకేసారి రెండు భారీ ఆఫర్లు ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి మరీ! ఒకటేమో మణిరత్నం సినిమా.. మరొకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీకి జోడీగా అవకాశం. మొదట్లో ఈ ఇద్దరు దర్శకులు తమతమ సినిమాల్లో వేరే తారలను తీసుకోవాలని నిర్ణయించారు. ముందుగా మణిరత్నం తన సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఎంతోమంది తారలను సంప్రదించాడు. బాలీవుడ్ అగ్ర కథానాయికలతోపాటు ఆలియాభట్ లాంటి తారలదాకా ఆయన ఎంతోమందిని సంప్రదించాడు. కానీ అందరూ తిరస్కరించిన నేపథ్యంలో ఆయన ఫైనల్ గా నిత్యామీనన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇలా ఈ విధంగా ఈ అమ్మడికి మణిరత్నం సినిమాలో అవకాశం వచ్చింది. ఇక త్రివిక్రమ్ పరిస్థితి కూడా ఇంతే!

నిజానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వస్తున్న చిత్రంలో ఆయన సరసన ముగ్గురు కథానాయికలను తీసుకుంటున్నారు. ఇందులో సమంత, అదాశర్మను ఇప్పటికే ఎంపిక చేసేశారు. అయితే మూడో కథానాయిక కోసం మొదట్లో తర్జనభర్జన పడ్డారు. ఈ రేసులో కేథరిన్ ట్రెసా, ప్రణీతల పేర్లు బరిలోకి వచ్చాయి. వీరిద్దరిలో ప్రణీత ఫిక్స్ అయిందనే ప్రచారాలు కూడా కొనసాగాయి కానీ.. ఇంతలోనే ఏమైందో ఏమో ఆమె కూడా అకస్మాత్తుగా తప్పుకుంది. దీంతో ఆమె స్థానాన్ని నిత్యాతో భర్తో చేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్! దీంతో ఈ అమ్మడు తొలిసారిగా బన్నీతో జోడి కట్టబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ పార్ట్ కూడా జరిగింది. ఇక తరువాత జరగబోయే షెడ్యూల్ లో నిత్య ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం! ఇలా ఈ విధంగా నిత్యా కూడా ఊహించని విధంగా రెండు భారీఆఫర్లు రావడంతో ఈ అమ్మడి దశ తిరిగిపోయిందని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles