Kaththi movie problems solved release date confirmed

kaththi release date, kaththi tamil movie release problems, kaththi telugu movie release date, kaththi telugu audio songs, kaththi movie protests in tamilnadu, lyca productions controversy, koliwood latest updates, tollywood latest movies, vijay next movie

kaththi movie problems solved release date confirmed : hero vijay latest movie kaththi solved all problems in releasing the movie unit talks with tamil protestors fruitful agrees to remove lyca banner name from movie

అమ్మ చొరవతో ‘కత్తి’కి తొలగిన అడ్డంకులు

Posted: 10/21/2014 04:46 PM IST
Kaththi movie problems solved release date confirmed

తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతున్న కత్తి సినిమా విడుదలకు నెలకొన్న అడ్డంకులు తొలగాయి. వివాదంకు కారణం అయిన లైకా సంస్థ పేరును సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ‘కత్తి’ యూనిట్ ప్రకటించటంతో విడుదల చేసేందుకు తమిళ సంఘాలు అనుమతి ఇచ్చాయి. విడుదలకు అనుమతి ఇవ్వటం పట్ల హీరో విజయ్ సహా సినిమా ప్రముఖులు పలువురు తమిళ ఉద్యమ సంఘాలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపాయి. ప్రజల మనోబావాలను గుర్తించి థియేటర్లు, సినిమా యాజమాన్యం ‘లైకా’ పేరును తొలగించినట్లు విజయ్ ప్రకటించారు.

అటు ఈ సినిమా విడుదలకు సహకరించిన అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు విజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమకు సహకారం అందించి అండగా నిలిచిన ‘పురుట్చితలైవి’ హృదయపూర్వక అభినందనలు అని విజయ్ పేర్కొన్నారు. భారీ అంచనాలతో నిర్మించిన ఈ సినిమా విడదలపై గత రాత్రి వరకు అనుమానాలు ఉన్నాయి. 23న సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంది. ఈ ప్రకటన తెలిసిన తమిళ ఉద్యమ సంఘాలు తమ ఆందోళనలు ఉదృతం చేశాయి. సోమవారం రాత్రి చెన్నైలోని రెండు థియేటర్లపై రాళ్ళదాడి, కిరోసిన్ బాంబులతో నిరసనకారులు దాడులు చేశారు.

ఈ ఘటనలతో సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ల యాజమన్యాలు ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఉద్యమ సంఘాలతో సినిమా ప్రతినిధులు చర్చలు జరిపారు. ‘కత్తి’ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ బ్యానర్ భాగస్వాముల్లో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లైకా నిర్మించే సినిమాను అడ్డుకోవాలంటూ మొదటి నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరకు ఉద్రిక్రతలకు దారి తీయగా చర్చలు జరిపిన యాజమాన్యం పేరను తొలగించేందుకు అంగీకరించింది. దీంతో బుధవారం రోజు తమిళనాట ‘కత్తి’ విడుదల కానుంది. ఇక తెలుగులో ఈనెల 31న ఈ సినిమా విడుదల అవుతుంది. దీపావళి రోజున తెలుగు ఆడియో విడుదల కానుంది.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaththi  vijay  tamilnadu  lyca productions  

Other Articles