తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సినిమా విడుదల తేది ఈనెల 23 (తమిళనాడులో) ప్రకటించినా విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలు సంఘాల హెచ్చరికలతో థియేటర్ల యాజమాన్యాలు సినిమాను తీసుకోవాలంటే భయపడుతున్నాయి. అందువల్లే ‘కత్తి’ని ప్రదర్శించే థియేటర్లు ఏవో కూడా ఇంకా తెలియటం లేదు.
ఇదిలా ఉండగా.., సోమవారం రాత్రి చెన్నైలోని సత్యం మల్టీప్లెక్స్ పై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు ద్వంసం అయ్యాయి. థియేటర్, టికెట్ కౌంటర్లలోకి కిరోసిన్ బాంబులను విసిరేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అదృష్ట వశాత్తు ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ దాడిపై స్పందించేందుకు, నిరసన తెలిపేందుకు కూడా ఎవరూ ముందుకురాకపోవటం చూస్తేనే పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.
లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా మొదటి నుంచి వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్స్ సంస్థలో భాగస్వామిగా ఉన్న ఒకరు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహితుడు కావటం వివాదానికి కారణం అయింది. లంక అంటే ఒంటికాలిపై లేచే తమిళ ప్రజలు.., తమ పౌరులను క్రూరంగా హింసించిన రాజపక్సే సన్నిహితుడితో సినిమా చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే ఎవరు ఎన్నిచెప్పినా.., ఎంత బ్రతిమిలాడినా సినిమాను మాత్రం విడుదల కానివ్వము అని తెగేసి చెప్తున్నారు. మనోభావాలతో ముడిపడిన ఈ వివాదం ఎటు వెళుతుందో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more