నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని మనకు తెలుసు. అంటే అవతలి వారు మనకు నమస్కారం పెట్టినపుడు మనం కూడా వారికి ప్రతిగా గౌరవం తెలపాల్సి ఉంటుంది. ఇది సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు హీరో విక్రమ్ ఇదే చేస్తున్నాడు. ఆ మద్య హాలివుడ్ హీరో ఆర్నాల్డ్ భారత్ కు వచ్చాడు. ‘ఐ’ సినిమా ఆడియో రిలీజ్ కోసం వచ్చిన ఆర్నాల్డ్ కార్యక్రమంకే అదనపు హంగుగా నిలిచారు. అందరూ సినిమా, ఆర్నాల్డ్ గురించే చర్చించుకున్నారు.
అలా వచ్చిన ఆర్నాల్డ్ బిజీ షెడ్యూల్ కారణంగా విక్రమ్ తో ఎక్కువసేపు ఉండలేదట. దీంతో సరదాగా గడిపేందుకు కాలిఫోర్నియా రావాలని చియాన్ ను హాలీవుడ్ స్టార్ ఆహ్వానించాడు. ఇందుకు సానుకూలంగా స్పందించిన విక్రమ్ వస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం త్వరలో కాలిఫోర్నియా పర్యటనకు వెళ్తాడని ‘ఐ’యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. కేవలం పిలుపును మన్నించి వెళ్తుండటం అంటే.. వ్యక్తికి వారి విజ్ఞప్తలకు విక్రమ్ ఇచ్చే గౌరవం ఏంటో తెలుస్తుంది అని కోలీవుడ్ ప్రముఖులు కితాబిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘ఐ’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తమిళం, తెలుగు, హింది సహా పలు ప్రాంతీయ భాషలు, వివిధ ప్రపంచ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్రాఫిక్స్, ఎడిటింగ్ వంటి పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతుంది. ఈ మూవీలో విక్రమ్ మూడు రోల్స్ లో నటించాడు. ఇవి ఒకదానితో మరొకటి పూర్తిగా డిఫరెంట్ గెటప్స్. అమీజాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం అందించాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more