Rakul preet singh dream to act with pawan kalyan will come true

rakul preet singh, rakul preet singh hot photos, rakul preet singh hot photo shoot, rakul preet singh bikini photos, rakul preet singh movie updates, pawan kalyan latest news, pawan kalyan gabbar singh 2 movie, pawan kalyan gabbar singh 2 movie schedules, pawan kalyan political news, pawan kalyan movie updates, gabbar singh 2 movie updates

According to the tollywood source rakul preet singh dream to act with pawan kalyan will come true by gabbar singh 2 movie

కోరిక తీర్చుకోవడానికి ఊగిపోతున్న పంజాబీ డాల్!

Posted: 10/20/2014 01:51 PM IST
Rakul preet singh dream to act with pawan kalyan will come true

చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చుకున్న ఏ కొత్త హీరోయిన్ గురించి అయినా అప్పుడే కొన్ని హాట్ గాసిప్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంటాయి. వ్యక్తిగత విషయాలు, బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్స్, కోరికలు ఇంకా ఇతరత్ర విషయాలకు సంబంధించి ఏదో ఒక వార్త రావడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు పంజాబీ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అటువంటి వార్తల జాబితాలోకే చేరిపోయినట్లు కనిపిస్తోంది. ఈమె తన కోరికను తీర్చుకోవడంకోసం చిత్రపరిశ్రమలో నానాతంటాలు పడుతోందని సమాచారాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఆమె కోరిక ఏంటో తెలుసా...?

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా టాప్ హీరోతో కలిసి కనీసం ఒక్క సినిమా చేయాలనే కోరిక వుంటుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ, విజయాలు సాధించినప్పటికీ పెద్ద హీరోలతో కలిసి పనిచేయలేదనే బాధ ప్రతిఒక్కరిలోనూ వుంటుంది. ముఖ్యంగా చిన్నసినిమాల్లో వరుస విజయాలు సాధించుకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారలైతే ఇటువంటి జాబితాలో ముందుగా వుంటారు. స్టార్ హీరోలతో కలిసి పనిచేయాలని వుందంటూ తమ కోరికలను బయటపెడుతుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ కోరిక కూడా అటువంటిదే! వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించాలనే కోరిక వుందుంటూ ఇటీవలే ఈ అమ్మడు తన మనసులోని మాటను బయటపెట్టింది. కేవలం కోరికే కాదు.. టార్గెట్టు కూడా అని అంటోంది ఈ ముద్దుగుమ్మ!

మరి ఈ అమ్మడు అనుకున్నట్టుగా కోరిక తీరుతుందా..? అంటే త్వరలోనే తీరబోతోందని టాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం! పవన్ కల్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్ 2' సినిమాకి కథానాయికగా ఈ ముద్దుగుమ్మను దాదాపు ఓకే చేసినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. చిత్ర దర్శకుడు సంపత్ నంది ఈమెను రికమెండ్ చేస్తూ పవన్ వద్ద ప్రపోజల్ పెట్టాడని.. పవన్ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టూ చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగానే జరిగితే.. ఈ అమ్మడు పవన్ తో నటిస్తే.. టాలీవుడ్ లో ఈమె రేంజ్ మరింత పెరిగిపోతుందని, అలాగే రెమ్యునరేషన్ కూడా తారాస్థాయికి చేరడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  rakul preet singh  gabbar singh 2 movie  tollywood news  telugu news  

Other Articles