Colors swathi writing poems

colors swathi movies, colors swathi next movie, colors swathi writings, colors swathi poems, colors swathi tv show, telugu poems, telugu famous writings, movie writers and dialogue writers, tollywood latest updates

heroine colors swathi poems : telugu smiling actress colors swathi now become writer swathi with her latest poems and writings first she started her career with tv anchoring than become heroine now writing poems

కలర్స్ స్వాతి పేరు మార్చుకుంటోంది

Posted: 10/16/2014 04:41 PM IST
Colors swathi writing poems

సింప్లి స్మైలింగ్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ తార స్వాతి పేరు మార్చుకుంటోంది. ఇన్నాళ్లు కలర్స్ స్వాతిగా ఉన్న పేరు.. ఇకపై కవయిత్రి స్వాతిగా మారబోతుంది. మాటల గారడీ చేసే ఈ అమ్మడు ఇప్పుడు రచనలు మొదలు పెట్టింది. మనసులో దాగి ఉన్న భావాలను ఇంగ్లీషులో రాయటం మొదలు పెట్టింది. ‘‘సమ్ ఐస్ సీ యువర్ వీక్‌నెస్, అండ్ ధైర్ లిప్స్ స్ప్రెడ్ అగ్లీ లైస్. దే యూజ్ ధైర్ లార్జ్ లార్జ్ వింగ్స్, దే యూస్ దెమ్ టు ప్లై ఫాస్ట్ అండ్ హై’’. అంటూ కవితలు రాస్తోంది.

ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కవితలు రాసుకుంటున్న రష్యా తెలుగమ్మాయి... త్వరలో పెన్ను చేతబట్టి పేపర్ పై రాసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే తాజా కవితను బట్టి చూస్తే ఈ గుమ్మకు ఎక్కడో కాలి రాస్తున్నట్లుగా అన్పిస్తుంది. తనకు ఎదురైన అనుభవాలు, వ్యక్తులు వారిని ఉద్దేశించి తన ఆక్రోశాన్ని ఇలా వెల్లగక్కినట్లు కన్పిస్తుంది. మొదట్లో స్మైలింగ్ ఫేస్ తో బాగానే ప్రేక్షకుల ముందు కన్పించింది. చలాకీగా ఉన్నప్పటికీ... ఇప్పటి టాలీవుడ్ ప్రముఖులు కోరుకునేది తక్కువగా ఉండటంతో నవ్వులు కాస్త తగ్గాయి.

రష్యాలో పుట్టిన ఈ తెలుగమ్మాయి ముందుగా ఓ టీవీ చానెల్ లో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ ప్రోగ్రాం పేరే చివరకు ఇంటి పేరుగా మారిపోయింది. తర్వాత సినిమాల్లోకి వచ్చింది. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో సినిమాలు చేసింది. ఇంకా చెప్పాలంటే తెలుగు కంటే తమిళం, మళయాల సినిమాలే ఎక్కువగా చేసింది. ఆమద్య విడుదలైన ‘స్వామిరారా’తో గ్యాప్ తర్వాత స్వాతి తెలుగులో కన్పించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె నటించిన తెలుగు సినిమా ‘కార్తికేయ’ దీపావళి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : colors swathi  poems  tollywood  latest updates  

Other Articles