Sundeep kishan joru movie release date

sundeep kishan joru movie, sundeep kishan next movie, sundeep kishan joru release date, telugu movies in 2014, upcoming telugu movies, joru movie updates, sundeep kishan movies, rashi khanna movies, joru movie songs, tollywood latest updates

sundeep kishan joru movie release date : telugu latest popular hero sundeep kishan latest movie joru getting ready fastly to release by next month the as per film unit announcement this movie going to release on november 7

సందీప్ ‘జోరు’ డెలివరీ డేట్

Posted: 10/16/2014 03:26 PM IST
Sundeep kishan joru movie release date

చిన్న సినిమాలతో మెల్లగా ప్రేక్షకులను దోచుకుంటున్న సందీప్ కిషన్ మంచి జోరుమీదున్నాడు. అందుకేనేమో ఆయన తాజా సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. ఇకపోతే ‘జోరు’ సినిమా విడుదల తేది ఖరారైంది. నవంబర్ 7న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ పరీక్షకు వెళ్లనుంది. అది పూర్తి చేసుకుని నవంబర్ 7న ప్రేక్షకులకు సినిమాను డెలివరీ చేస్తామని యూనిట్ చెప్తోంది.

‘గుండెల్లో గోదారి’ ఫేం నాగేంద్ర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. రాశిఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మలతో కలిపి షూట్ చేసిన పాట కూడా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ మద్య విడుదలైన సినిమా పాటలకు కూడా మంచి టాక్ వచ్చింది. అశోక్, నాగార్జున కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును శ్రీ కీర్తి ఫిలింమ్స్ బ్యానర్ అందిస్తోంది. గతంలో సందీప్ ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాలు హిట్ అయిన విషయం తెలిసిందే.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sundeep kishan  joru  latest updates  tollywood  

Other Articles