Thamanna bhatia takes break from bahubali movie

thamanna bhatia, thamanna hot, thamanna latest hot photos, thamanna latest movies, thamanna upcoming movies, latest movie news, telutu latest gossips, bahubali, bahubali movie shooting, bahubali release date, bahubali release, bahubali movie updates, bahubali latest photos, bahubali gossips, bahubali shooting photos, prabhas, prabhas wiki, prabhas images, prabhas ys sharmila, prabhas love affair, prabhas latest movies, prabhas upcoming movies, latest updates, tollywood latest updates

milky beauty thamanna takes break from bahubali to promote her brands and to go for holiday vacation : after one month thamanna will join with bahubali shooting till that she will be on holiday trip

బాహుబలి నుంచి తప్పుకున్న మిల్కీబ్యూటి

Posted: 10/14/2014 03:27 PM IST
Thamanna bhatia takes break from bahubali movie

మిల్కి బ్యూటి తమన్నా కాస్త రిలీఫ్ కోరుకుంటోంది. ఎప్పుడూ షూటింగులు, సినిమా సెట్టింగులు, మేకప్.. ప్యాకప్ ఇదే జీవితం కావటంతో బోర్ కొట్టిందో ఏమో కాస్త మార్పు కావాలనుకుంటోంది. అందుకోసం మిల్కిబ్యూటీ టూర్ ప్లాన్ వేసింది. ప్రస్తుతం నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ కు నెలరోజులు బ్రేక్ ఇచ్చేసి ఫ్యామిలితో కలిసి వెకేషన్ టూర్ వెళ్తుందని సినిమా వర్గాలు చెప్తున్నాయి. టూర్ లో భాగంగా విదేశాలకు వెళ్తుందని అంటున్నారు. అయితే నెలరోజల సెలవులు పరదేశీ పర్యటనలకే కాకుండా ఇతర పనులు చేసుకునేందుకు ఉపయోగించుకుంటుందట.

సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా తమన్నా ఉంది. దీంతో ఆయా బ్రాండ్ల ప్రమోషన్ యాడ్లు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటుందని చెప్తున్నారు. పాలరాతి బొమ్మ ప్రకటనలు షూట్ చేసేందుకు ఎదురుచూస్తున్న కెమెరాలను ప్రస్తుతం దుమ్ము దులిపే పనిలో యాడ్ ఏజన్సీలున్నాయి. దీంతో సెలవుల్లో డబ్బులు ఖర్చుపెట్టుకోవటమే కాకుండా.., సైడ్ బిజినెస్ లు కూడా సెట్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటోందన్నమాట.

ప్రస్తుతం బాహుబలి షూటింగ్ రామోజి ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో రాణా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ పిరియాడికల్ సినిమాను ఏడాదికి పైగా షూట్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న‘బాహుబలి’ ఏప్రిల్ 2015లో తొలి పార్ట్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత రెండవ పార్ట్ విడుదల చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thamanna  bahubali  break  latest updates  

Other Articles