Gopala gopala movie shooting will complete soon

gopala gopala movie, gopala gopala movie latest updates, gopala gopala first look, gopala gopala teaser, gopala gopala trailer, gopala gopala songs, gopala gopala latest news, gopala gopala songs free download, gopala gopala images, gopala gopala stills, gopala gopala shooting images, latest updates, tollywood, latest gossips, pawan kalyan, pawan kalyan facebook, pawan kalyan images, pawan kalyan wife, pawan kalyan marriage, pawan kalyan latest movies, pawan kalyan upcoming movies, pawan kalyan divorce, pawan kalyan son, pawan kalyan daughter, akhira nandan, venkatesh, venkatesh movies, venkatesh latest updates, venkatesh upcoming movies, telugu multistarrer movies, sreya, sreya sharan, sreya hot, sreya latest updates

pawan kalyan latest movie gopala gopala shooting coming towards ending presently film unit shooting climax scenes : gopala gopala movie shooting will end soon and ready to start post production works to release for sankranthi

గోపాల షూటింగ్ కంచికి... త్వరలోనే అంతా ఇంటికి !!

Posted: 10/13/2014 11:56 AM IST
Gopala gopala movie shooting will complete soon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ సినిమా ‘గోపాల గోపాల’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమాలో కావాల్సిన గ్రాఫిక్ ఎఫెక్ట్ లు ఇతర అడిషనల్ ఎఫెక్ట్ కోసం వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. హైదారబాద్ శివార్లోని శంషాబాద్ లో ఓ ఆలయంలో పవన్ నేపథ్యంగా కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ప్రస్తుతం సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సన్నివేశాల్లో పవన్ తో పాటు వెంకటేష్, శ్రియ, మిథున్ తదితరులు నటిస్తున్నారు. అయితే షూటింగ్

ఈ సన్నివేశాలు పూర్తియితే సినిమా షూటింగ్ పూర్తియనట్లే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ తర్వాత.., పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లనుంది. ఇది దాదాపు ఒక నెల నుంచి నెలన్నర సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత పది రోజులు ఆగితే సంక్రాంతి వస్తుండటంతో సినిమాను జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు సినిమాలో పవన్ కృష్ణుడి వేషంలో కన్పిస్తుండటంతో.. సరికొత్తగా చూపించేందుకు కొత్త హంగులు అద్దుతారని అంతా అంటున్నారు. ఇందులో పవన్ కోసం ప్రత్యేకంగ బైక్ ను డిజైన్ చేసిన విషయం తెలిసిందే.

పవన్ - వెంకటేష్ మల్టీ స్టారర్ సినిమాగా వస్తున్న ‘గోపాల గోపాల’ లో వెంకటేష్ భార్యగా శ్రియ నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమ్మడు పవన్ కు (కృష్ణుడికి) పరమ భక్తురాలు. ఆమె విజ్ఞప్తి ప్రకారం వెంకటేష్ కు సాయం చేసేందుకు పవన్ దిగి వచ్చి ఏం చేస్తాడు అనేది కధ అని గతంలో సినిమా వర్గాలు తెలిపాయి. పవన్ చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావటంతో దీనిపై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పాటలను నవంబర్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. హిందీలో హిట్ అయిన ‘ఓ మై గాఢ్’ ఆధారంగా డాలి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gopala gopala  venkatesh  latest updates  

Other Articles