Purijagannath next movie with mahesh babu

puri jagannath, puri jagannath movies, puri jagannath latest updates, puri jagannath wiki, puri jagannath family, puri jagannath son, puri jagannath wife, puri jagannath daughter, puri jagannath house, puri jagannath new house, puri jagannath home, puri jagannath mahesh babu movies, puri jagannath up coming movies, mahesh babu, mahesh babu wiki, mahesh babu movies, mahesh babu latest updates, mahesh babu family, mahesh babu gossips, mahesh babu upcoming movies, mahesh babu movies list, tollywood news, latest updates, telugu latest updates

director puri jagannath to make his next movie with prince mahesh babu : puri jagannath ready to make movie with mahesh babu this may be like a pokiri seems to be action and entertainer

పోకిరి కోసం పూరీ యాక్షన్

Posted: 10/10/2014 10:06 AM IST
Purijagannath next movie with mahesh babu

మహేష్ బాబుకు కెరీర్ లో బిగ్ హిట్ అంటే ‘పోకిరి’ అనే చెప్పాలి. అప్పటివరకు గ్లామర్, మిల్కిబాయ్ గా ఉన్న మహేష్ లో ఒక్కసారిగా తెలియని యాక్షన్, ఎంటర్ టైనర్ పర్సన్ ను బయటకు తీసుకువచ్చింది. సింపుల్ కధతో తీసిన సినిమా పెద్ద హిట్ అయ్యింది. అప్పటివరకున్న రికార్డులకు ‘పోకిరి’ మరో రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. ఆ తర్వాత మహేష్ బాబు చాలా సినిమాలే చేసినా ఆ స్థాయిలో మాత్రం సంచలనాలు సృష్టించలేదు అని ఖచ్చితంగా చెప్పగలము. ఈ క్రెడిట్ అంతా హీరో మహేష్ బాబు తో పాటు డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కు కూడా చెందుతుంది.

‘పోకిరి’ తర్వాత మహేష్ - పూరి కాంబినేషన్ లో వచ్చిన ‘బిజినెస్ మెన్’ సినిమా కూడా హిట్ అయింది. దీంతో మరోసారి మహేష్ తో సినిమా చేసేందుకు పూరి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రిన్స్ కు తగ్గట్టుగా హై వోల్టేజి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ కధలను మించేలా ఈ స్టోరీ ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే కాన్సెప్ట్ ఏమిటి అనే విషయం మాత్రం బయటకు చెప్పటం లేదు. అయితే అంతా బాగుంది కానీ.., ఈ కధను ఇంకా మహేష్ కు చెప్పలేదట. ప్రస్తుతం ప్రిన్స్ ఫారిన్ టూర్ లో ఉండటంతో.., ఆయన పర్యటన పూర్తి చేసుకుని వచ్చాక కథను విన్పిస్తాడని తెలుస్తోంది.

అటు ఈ ప్రిన్స్ ఓకే చెప్పినా ఈ సినిమా ఇప్పట్లో కాదు. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబుకు కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇది పూర్తయ్యాకే వీరిద్దరి కాంబినేషన్ సినిమా సెట్ పైకి వెళ్ళే అవకాశముంది. మహేష్-పూరి ముచ్చటగా మూడవ కాంబినేషన్ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. తొలి సినిమాలో రౌడి పోలిస్ ను, రెండవ సినిమాలో మంచి రౌడిని చూపించారు. రెండింటిలో హీరోకు విలన్ క్యారెక్టరే అద్దారు కాబట్టి.., ఈ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసి కధను మారుస్తారు అని కొందరు చెప్తుంటే., కాదు రెండింటికి పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని అని మరికొందరు చెప్తున్నారు. జగన్నాధుడి మదిలొ మెదిలిన ఆలోచన ఏమిటో త్వరలోనే బయటకు తెలిసే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  puri jagannath  latest updates  tollywood  

Other Articles