Anushka in raghavendra rao son new movie

anushka, anushka hot, anushka latest, anushka movies, anushka latest movies, anushka marriage, anushka shetty wiki, anushka hot photos, anushka latest hot photos, rudramadevi, rudramadevi movie, rudramadevi release date, rudramadevi movie latest updates, raghavendra rao, raghavendra rao movies, raghavendra rao wiki, raghavendra rao tv show, raghavendra rao latest updates, raghavendra rao family, raghavendra rao hit movies, tollywood news, latest updates, latest news

anushka shetty may be in raghavendra rao son latest heavy budget movie : raghavendra rao and his son prakash selected anushka for prakash latest movie soon she may respond on this project

అనగనగా అంటే అనుష్క రాదుగా..

Posted: 10/09/2014 05:38 PM IST
Anushka in raghavendra rao son new movie

అనగనగా ఓ రాజ కుటుంబం.., ఆ కుటుంబంలో లక్ష్మి మంచు విలన్ అయితే..., శృతి హాసన్ హీరోయిన్. అదే ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా. మంచి కాన్సెప్ట్, భారీ బడ్జెట్ తో వచ్చినా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవటంతో సినిమా ఆడలేదు. తొలుగులో శృతి హాసన్ కు తొలి సినిమా ఫ్లాప్ అయినా.., ఆ తర్వాత పికప్ అయి టాప్ ప్లేస్ కు ఎదిగింది. అయితే సినిమాను తీసిన డైరెక్టర్ దర్శకేంద్రుడి తనయుడు ప్రకాష్ మాత్రం ఆ తర్వాత పెద్దగా కన్పించలేదు. ఇప్పుడీయన మళ్ళీ ఓ సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు.., భారీ బడ్జెట్ మూవీ అట.

హీరోయిన్ ఓరియంటెడ్ కధతో భారీగా ఖర్చు పెట్టాలని చూస్తున్న ప్రకాష్.., తన కధకు అనుష్క అయితే బాగా సూట్ అవుతుందని అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని తండ్రి రాఘవేంద్ర రావుకు చెప్పగా ఆయన కూడా బాగానే ఉంటుంది యోగా టీచర్ అన్నాడట. ఇంకేముంది డైరెక్టర్ ఓకే చెప్పాడు సినిమా అయిపోయినట్లే అనుకుంటే కుదరదు. ఇక్కడ ఉంది బొమ్మాళి. అమ్మడుకి నచ్చితేనే సైన్ చేస్తుంది... షూటింగ్ కు వస్తుంది. ఇప్పుడిదే టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. దర్శకేంద్రుడి తనయుడి సినిమాకు ఓకే చెప్తుందని కొందరు.., పక్కన బెట్టడం ఖాయమని మరికొందరు అంటున్నారు.

ఇందుకు కారణం ఏమిటి అంటే.., ఇప్పటికే అనుష్క హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తెగ చేస్తుంది. ఇవి బాగానే హిట్ అవుతున్నా.., మరీ ఇవే ఎక్కువ అయితే హీరోయిన్ ఆఫర్లు తగ్గే ప్రమాదం ఉంది. అందువల్ల అమ్మడు ఈ అవకాశంను వద్దు అంటుంది అని అంటున్నారు. అదీ కాకుండా ప్రకాష్ పాత సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’ ఫ్లాప్ అయింది. ఆయన తీసే తాజా సినిమా కూడా దాదాపు పాతకాలం కధకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అందువల్ల ప్రయోగం బెడిసికొడితే కెరీర్ కు పెను ప్రమాదమే అని భయపడుతుందట. అందువల్లే ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పదు అంటున్నారు. మరి బొమ్మాళి ఎలా డిసైడ్ అవుతుందో ఎదురుచూడాలి. అటు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరు..? సంగీతం వంటి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghavendra rao  anushka  prakash  latest updates  

Other Articles