Nagarjuna on shiva movie

nagarjuna, nagarjuna movies, nagarjuna family, nagarjuna latest, nagarjuna news, nagarjuna family latest updates, nagarjuna wife, nagarjuna first wife, shiva, shiva movie, shiva movie songs, ram gopal varma, ram gopal varma latest news, ram gopal varma news, amala, amala on dogs, amala family

hero nagarjuna shared his memories of shiva movie on the occasion of movie completing 25years : shiva movie changed my lifestyle that gave great experience says nagarjuna about shiva movie

షూటింగ్ లో సరసాలు ఆడింది నిజమే

Posted: 10/08/2014 10:53 AM IST
Nagarjuna on shiva movie

రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగార్జున తన రొమాన్స్ గురించి స్వయంగా వివరాలు బయటపెట్టారు. తనకెంతో పేరు తెచ్చిన ‘శివ’ సినిమా విడుదలయి 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మంగళవారం రోజు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జునతో పాటు ఆయన భార్య ‘శివ’ సినిమాలో హీరోయిన్ అమల, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నటులు తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, ఉత్తేజ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాటి జ్ఞాపకాలను అంతా గుర్తు చేసుకున్నారు.

అందులో భాగంగా ‘శివ’ సినిమాపై నాగార్జున మాట్లాడుతూ.., ఇది ఒక ట్రెండ్ ను సెట్ చేసిన సినిమాగా చెప్పాడు. ఇందులో నటించినందుకు జీవితాంతం గర్విస్తానని చెప్పాడు. "శివ తన సినిమా జీవితాన్నే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతగానో మార్చేసిందన్నారు. సినమాకు సంబంధించి ఎన్నో జ్ఞాపకాలున్నట్లు వెల్లడించారు. షూటింగ్ స్పాట్ లో జరిగిన చిలిపి పనుల గురించి కూడా కింగ్ నవ్వుతూ ఇలా అన్నాడు. ‘సినిమా షూటింగ్ బ్రేక్ లో కెమేరామెన్ రసూల్ తో బయట క్రికెట్ ఆడేవాడిని.. ఇదే సమయంలో ఖాళీ దొరికితే అమలతో సరసాలు కూడా ఆడేవాణ్ణి" నవ్వుతూ చెప్పారు.

రొమాంటిక్ హీరో అని పేరు తెచ్చుకున్న నాగ్.., నిజంగానే రొమాంటిక్ మేన్ అని తాజా ప్రకటనతో స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమాపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘శివ’ సినిమా నేటికి.. ఏ నాటికి ఒక ట్రెండ్ సెట్టర్ అన్నారు. మరెవ్వరూ ఇలాంటి సినిమాను ఇలాగే తీయలేరు అన్నారు. ఈ సినిమా నాగార్జున వల్లే అంత హిట్ సాధించిందన్నారు. అద్బుతాలు అనేవి సృష్టించబడవు.., సంభవిస్తాయి అలాంటిదే ‘శివ’ సినిమా అన్నారు. ఈ సందర్బంగా సిరాశ్రీ రూపొందించిన ‘పాతికేళ్ళ శివ’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna  shiva movie  amala  ram gopal varma  

Other Articles