Govindudu andarivadele movie nizam record collections

govindudu andarivadele movie news, govindudu andarivadele, govindudu andarivadele movie collections, govindudu andarivadele movie first week collections, kajal agarwal, kajal agarwal ram charan, director krishna vamshi, producer bandla ganesh, govindudu andarivadele nizam collections, govindudu andarivadele movie photos

govindudu andarivadele movie collections in nizam is record by comparing other commercial movies by the analysis of tollywood boxoffice

రికార్డ్ కలెక్షన్లను రాబట్టిన ‘‘గోవిందుడు’’!

Posted: 10/07/2014 03:29 PM IST
Govindudu andarivadele movie nizam record collections

ఫ్యామిలీ కథాచిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ ఈసారి రామ్ చరణ్ తో జతకట్టి అచ్చతెలుగు కుటుంబకథాచిత్రంగా ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమాను తీసిన విషయం తెలిసిందే! ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. తాతగా ప్రకాష్ రాజ్, బాబాయ్ గా శ్రీకాంత్, ఆయనకు జంటగా కమిలినీ ముఖర్జీ ఇంకా తదితర ముఖ్య నటీనటులు నటించారు. దసరా కానుకగా విడుడలైన ఈ మూవీ.. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రేక్షకుల చేత మంచి ఫ్యామిలీ చిత్రంగా సూపర్బ్ అనిపించుకుంది. కమర్షియల్ గా హిట్టైన రామ్ చరణ్ కెరీర్ లోనే మంచి సినిమాగా కొంతమంది ప్రముఖులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ సినిమా అటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ ను పొందడంతోపాటు ఇటు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్లను కూడా రాబట్టుకుంటోందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

మంచి ఫ్యామిలీ మూవీగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ.. ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబట్టుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పైగా దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ మూవీ.. వీకెండ్ కి రెండురోజుల ముందే రిలీజ్ అయిన నేపథ్యంలో లాస్ట్ ఫస్ట్ వీక్ రావడంతో అన్ని చోట్లా కలెక్షన్స్ చాగా బాగున్నాయని బయ్యర్లు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల విషయం అటుంచితే.. ముఖ్యంగా నైజాంలో గోవిందుడు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ కు నమోదు చేసుకున్నాడని బాక్సాఫీస్ లెక్కలు తెలుపుతున్నాయి. తాజాగా అందిన కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం.. సోమవారం (06-10-2014) నాటికి ఈ మూవీ ఒక్క నైజాంలోనే 9 కోట్ల 60 లక్షల షేర్ సాధించింది. దీంతో మొదటివారం పూర్తయ్యేసరికి 10 కోట్ల మార్క్ ను చాలా ఈజీగానే క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఓ కమర్షియల్ మూవీ స్థాయిలో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి కలెక్షన్లను సాధిస్తుండటంతో నిర్మాత బండ్లగణేష్ ఫుల్ హ్యాపీగా వున్నారని తెలుస్తోంది. ఈ విధంగా కేవలం నైజాంలోనే కాదు.. అన్ని చోట్లా మంచి కలెక్షన్లను గోవిందుడు రాబడుతున్నాడని.. మొదటివారంలో ఈ మూవీలో రికార్డ్ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంవత్సరంలో విడుదలైన భారీ సినిమాలన్నింటిలోనూ ఈ మూవీ ఒక్కటే మంచి కలెక్షన్స్ తోపాటు సక్సెస్ ఫుల్ గా రన్న అవుతోందని అటు బయ్యర్లు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  tollywood boxoffice  ram charan  kajal agarwal  krishna vamshi  

Other Articles