Bang bang yet to enter 200 crore club

bang bang, 175 crore collections, Hrithik Roshan, Katrina Kaif

bang bang yet to enter 200 crore club, mints 175.61 crore gross worldwide in four days

రెండు వందల కోట్ల క్లబ్ లోకి చేరనున్న బ్యాంగ్ బ్యాంగ్..

Posted: 10/06/2014 04:59 PM IST
Bang bang yet to enter 200 crore club

గత కొన్నాళ్లుగా హిట్ లేక అల్లలాడిన హృతిక్ రోషన్.. బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంతో మళ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బ్యాంగ్ బ్యాంగ్ తో ఫామ్ లోకి వచ్చిన హృతిక్ తన సినిమా కలక్షన్లే విమర్శలకు నోటికి తాళాలు వేస్తాయంటున్నాడు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రెండు వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. సినిమా హిట్ అవ్వడంతో అటు కత్రినా కైఫ్ సహా సినిమా యూనిట్ అంతా సంబరాలు జరుపుకుంటున్నారు. తమ శ్రమకు తగిన ఫలితం వచ్చిందని ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమా రివ్యూలలో ఎన్ని విమర్శలు వచ్చినా, అసలు ఎందుకు చూడాలో అర్థం కావట్లేదంటూ విమర్శకులు జోకులు పేల్చినా.. హృతిక్ రోషన్ - కత్రినా కైఫ్ జంటగా మరోసారి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం మాత్రం కోట్లు కుమ్మరిస్తోంది. 140 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 175.61 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. ఇందులో భారత దేశంలో 134.47 కోట్లు, విదేశాల్లో 41.14 కోట్లు వసూలు చేసిందని సినిమా వర్గాలు తెలిపాయి.

సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా.. హాలీవుడ్లో వచ్చిన 'నైట్ అండ్ డే' సినిమాకు రీమేక్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఎంతో మెచ్చుకున్నారు. హృతిక్ రోషన్ ఈ సినిమాలో అన్నిచోట్లా సూపర్ స్టార్ అనిపించాడని, అతడి ప్రతి ఒక్క కదలికా సినిమాకు డబ్బులు తెస్తోందని ట్వీట్ చేశాడు. ఈ యాక్షన్ థ్రిల్ల్రర్ సినిమాలో డానీ డెంజోంగ్పా, జావేద్ జాఫ్రీ, దీప్తి నావెల్, కన్వల్జిత్ సింగ్, జిమ్మీ షేర్గిల్ లాంటి అలనాటి నటులు కూడా నటించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bang bang  175 crore collections  Hrithik Roshan  Katrina Kaif  

Other Articles