Ramcharan announced 2lakhs for a fan death

ram charan, ram charan teja, ram charan teja wife, ram charan teja wiki, ram charan teja movies, ram charan teja fan died, ram charan fan dead, ram charan on fan death, ram charan gives ex gratia, ram charan teja movies list, ram charan teja upcoming movies, govindudu andarivadele, govindudu andarivadele movie, govindudu andarivadele review, govindudu andarivadele latest news, govindudu andarivadele gossips, govindudu andarivadele movie free download, govindudu andarivadele rating, govindudu andarivadele latest updates, govindudu andarivadele public talk, kajal, kajal hot, kajal in govindudu andarivadele, latest news, tollywood

hero ramcharan announced 2lakhs rupees ex gratia to the family of died fan on govindudu andarivadele release date : ram charan feels sad for fan dies in stampade at ticket counter he given a helping hand to the victim family worth rupees 2lakhs

అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న అందరివాడు

Posted: 10/02/2014 10:54 AM IST
Ramcharan announced 2lakhs for a fan death

రామ్ చరణ్ తేజ చిరుత అని పేరునే కాదు... నడవడికలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అన్పించుకున్నాడు. చెర్రికి హృదయం గురించి ఫ్యాన్స్ కు బాగా తెలుసు. సన్నిహితులకు ఏమైనా అయితే తట్టుకోలేని సున్నిత మనస్సున్న వ్యక్తి రామ్ చరణ్. ప్రేక్షకులను దేవుళ్లుగా భావించే ఫ్యామిలి వారికి ఎప్పడూ అండగా ఉంటుంది.., ఆపద వస్తే ఆదుకుంటుంది అని మరోసారి నిరూపించారు. బుధవారం ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదల రోజున జరిగిన విషాద ఘటన అందరికి తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సినిమా టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో శివ అనే అభిమాని ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దుర్ఘటన పట్ల రామ్ చరణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ‘నా సినిమా కోసం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం ఎంతగానో కలచివేస్తోంది’ అని బాధపడ్డాడు. చనిపోయిన శివ ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటంతో పాటు... అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శివ కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. ఫ్యాన్స్ కూడా ఎమోషన్స్ ను కాస్త అదుపులో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బుదవారం ప్రపంచ వ్యాప్తంగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదల అయింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టికెట్ల కోసం థియేటర్ బయట భారీగా ఎదురుచూసిన ఫ్యాన్స్.., ఒక్కసారిగా లోపలికి ప్రవేశించారు. దీంతో తొక్కిసలాట జరిగి శివ అనే వ్యక్తి మృతి చెందగా.., పలువురు గాయపడ్డారు. వీరిలో కొందర్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సినిమాల పట్ల ప్రేక్షకులకు ఉండే క్రేజ్, ఎమోషన్స్, సినిమా చూడాలి అనే ఎగ్జయిట్ మెంట్ కాస్త కంట్రోల్ లో పెట్టుకోవటం మంచిది. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు గుర్తుంచుకోండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  fan death  ram charan  ex gratia  

Other Articles