Sharwanand next movie on chiranjeevi song name

sharwanand, sharwanand movies, sharwanand next movie, sharwanand upcoming movies, sharwanand latest, chiranjeevi, malli malli idi rani roju, malli malli idi rani roju movie, chiranjeevi songs, telugu ever green songs, ever green telugu songs, chiranjeevi hit songs, ever green chiranjeevi songs, latest news, tollwood

hero sharwanans next movie name is malli malli idi rani roju which is of chiranjeevi famous song with suhasini : in rakshasudu movie song malli malli idi rani roju is titled as sharwanand next movie name

చిరుది చూసి కాపి కొట్టేశారు.

Posted: 09/27/2014 03:17 PM IST
Sharwanand next movie on chiranjeevi song name

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ న్యూ ఈజ్ న్యూసెన్స్ అని ఊరికే అన్లేదు. ఈమద్య ఏరికోరి మరి కొత్త సినిమాలకు పాతసినిమాల్లోని మాటలు,  ముఖ్యంగా పాటల పేర్లు పెడుతున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న నాగచైతన్య కొత్త సినిమా ‘ఒక లైలా కోసం’ అనే టైటిల్ పేరు 1983లో వచ్చిన ‘రాముడు కాదు కృష్ణుడు’ సినిమాలోని ఓ పాట మొదటి లైన్. దీన్నే చైతు సినిమా టైటిల్ గా పెట్టేశారు. అటు నాగార్జున కొత్త సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనేది 1966లో వచ్చిన ‘ఆస్తిపరులు’ సినిమాలోని హిట్ సాంగ్.

ఇప్పుడీ ట్రెండును శర్వానంద్ కూడా ఫాలో అవుతున్నాడు. తన కొత్త సినిమాకు ‘ మళ్ళీ మళ్లి ఇది రాని రోజు’ అని పేరు పెట్టారు. ఇది చిరంజీవి-సుహాసిని నటించిన ‘రాక్షసుడు’ సినిమాలోని పాట. ఈ పాపులర్ పాట తొలి లైన్ నే శర్వానంద్ సినిమా పేరుగా పెట్టుకున్నాడు.  ఈ పేరు పెట్టుకోవటం వెనక వైబ్రేషన్స్ ఉన్నాయని టాక్ విన్పిస్తోంది. అంటే జనాళ్లో బాగా ప్రాచుర్యం ఉన్న పాట కావటంతో.., ఈ సినిమా పేరు కూడా సులువుగా జనాలకు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా వారంతా సినిమాల గురించి చర్చించుకోవటం మొదలు పెడతారు. దీనివల్ల ఉచిత ప్రచారంతో పాటు పాపులారిటీ వస్తుంది.

‘మళ్లీ మళ్ళి ఇది రాని రోజు‘ సినిమాలో శర్వానంద్ సరసన.., పొట్టి భామ నిత్య మీనన్ నటిస్తోంది. గుండెజారి గల్లంతయిందే తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో వస్తుందన్నమాట. ‘ఓనమాలు’ ఫేం క్రాంతి మాధవ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు సినిమా పేర్లను సీరియల్స్ కు పెట్టే సాంప్రదాయం ఉండగా.., కొత్తగా సినిమాల్లోని పాటల పేర్లను  మరో సినిమాకు పెట్టే కల్చర్ ఈ మద్య ఎక్కువయి పోతుంది. చూడాలి ఇది చివరకు ఎటు వెళ్తుందో. ఎందుకంటే కధలు రాయలేక.., పాత కధలనే అటు కదిపి.. ఇటు కదిపి మళ్ళీ సినిమాలు తీస్తున్నారు. ఇక పాటల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇతర బాషల్లోని ట్యూన్లు ఇక్కడ విన్పిస్తున్నాయి. ఇక్కడి రాగాలు అక్కడ పలుకుతున్నాయి.  ఇప్పుడు టైటిల్లు కూడా పాటలో నుంచి కట్ చేసి పెట్టేయటం జరుగుతోంది. సృజనాత్మకత తగ్గుతుంది అనేందుకు ఇదే నిదర్శనం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharwanand  chiranjeevi  malli malli idi rani roju  latest news  

Other Articles