Katrina says about her career in film industry

katrina kaif wiki, katrina kaif hot, katrina kaif latest photos,. katrina kaif hot photo shoot, katrina kaif updatest, latest news, bollywood heroines hot, actress hot photos, cinema, movie news, journey, autobio graphy

bollywood actress katrina kaif says about her nine years journey in film industry says it was a great experience got : in starting peroid many famous heros not agreed to act with me i never say they are bad but i remember their comments says sridevi

కసీ తీర్చుకోను.. కాని మర్చిపోను

Posted: 09/25/2014 10:50 AM IST
Katrina says about her career in film industry

మనల్ని బాధపెట్టేవారు చాలామంది ఉంటారు. అలాంటివారిని కొందరు గుర్తుంచుకుని మరీ దెబ్బతీస్తే..,  మరికొందరు మాత్రం పోనిలే అని లైట్ తీసుకుంటారు. కానీ కత్రినా కైఫ్ ఈ రెండూ కాకుండా మూడో రకమని చెప్తోంది. తన 9ఏళ్ళ కెరీర్ పై కత్రినా వివరణ ఇచ్చింది. లైఫ్ ఎలా సాగింది.. ఎన్ని అడ్డంకులు వచ్చాయనేది గుర్తు చేసుకుని మరీ చెప్పింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనను చాలామంది హీరోలు వద్దు అన్నారని చెప్పింది. కత్రినాతో అయితే చేయము అని చాలామంది మొహంమీద చెప్పేశారట. అయినా సరే వారిపై కోపం లేదని అంటోంది.

‘‘నాతో నటించికపోయినా ఏ ఇబ్బంది లేదు.., వారు చాలా అనుభవం ఉన్నవారు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. అందువల్ల నేను ఎవరిని ఏమి అనను. కానీ వారు నాపై అన్నమాటలు మాత్రం మర్చిపోను’’ అని పొడుగుకాళ్ళ సుందరి చెప్తోంది. ప్రతి ఒక్కరికి ప్రారంభంలో ఇబ్బందులు, అవమానాలు, తప్పవనీ.., వాటిని ఎదుర్కుంటూ సాగితేనే విజయం సాధిస్తామని అంటోంది. ఎవరో ఏదో అన్నారని బాధపడి, వారిపై కోపం పెంచుకోవటం కంటే.., విమర్శలను సవాల్ గా తీసుకుని., పనిచేసి చూపించటం ఉత్తమం అని క్యాట్ హితవు పలుకుతోంది.

తనకు సహకరించి... ఆదరించిన ప్రేక్షకులను ఎప్పూడూ మర్చిపోనని వారికి ధన్యవాదాలు తెలిపింది. సెక్సీ పాత్రలు.., అప్పుడప్పుడూ కన్పించే పాత్రల నుంచి కెరీర్ మొదలు పెట్టిన కత్రినా., గ్లామర్, నటనతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. బాలీవుడ్ లో డేట్లు ఖాళీ లేని బిజీ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. అయినా సరే తన గతం మర్చిపోను అని నిరాడంబరంగా చెప్తోంది. తెలుగులో వెంకటేష్ తో కలిసి ‘మల్లీశ్వరి’ సినిమాలో హీరోయిన్ గా క్యాట్ నటించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : katrina kaif  bollywood  movie news  latest news  

Other Articles