Laxmi menon replaced by sruti hassan in vishal movie

laxmi menon, laxmi menon hot, laxmi menon latest, laxmi menon with vishal, laxmi menon upcoming movies, laxmi menon next movies, sruti hassan, sruti hassan hot, sruti hassan latest, sruti hassan hot photoshoot, sruti hassan upcoming movies, sruti hassan wiki, sruti hassan marriage, sruti hassan family, tollywood, koliwood, film news, movie news, bollywood, latest news, vishal, vishal movies, vishal latest, vishal wiki

laxmi menon doing her third movie with vishal she got chance by the same offer rejected by sruti hassan : sruti hassan rejected vishal movie chance so director given offer to laxmi menon who is name of successfull pair with vishal

శృతిని వదిలి లక్కీని పట్టుకున్నాడు

Posted: 09/21/2014 01:48 PM IST
Laxmi menon replaced by sruti hassan in vishal movie

కలువ కళ్ళ భామ శృతి హాసన్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. విశాల్ మాత్రం ఆమెను లైట్ తీసుకున్నాడు. రాలేనని చెప్తే.. పర్లేదు అన్నట్లుగా వ్యవహరించాడు. ముచ్చటగా మూడవసారి లక్ష్మీ మీనన్ తో కలిసి సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా తమిళంలో విశాల్ - లక్ష్మీ మీనన్ జంటగా వచ్చిన ‘‘నాన్ శిగప్పు మనిదన్’’ సినిమా బాషా ప్రాధాన్య రాష్ర్టంలో బాగానే హిట్ అయింది. ఈ సినిమాలో ఇద్దరి మద్య రొమాన్స్, కెమిస్ర్టీ బాగా సెట్ అయింది. మంచి జోడిగా ప్రేక్షకుల నుంచి టాక్ కూడా వచ్చింది.

ఇప్పుడిదే జంట మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతోంది. విశాల్ హీరోగా వస్తున్న కొత్త సినిమా కోసం హీరోయిన్లను వెతికిన డైరెక్టర్ సుశీంద్రన్ శృతి హాసన్ అయితే బాగుంటుంది అనుకున్నారు. అయితే వరుసగా శృతి వస్తే.., అభిమానుల శృతి తప్పే అవకాశముందని భావించారు. అటు అమ్మడు కూడా ఖాళీగా లేనని చెప్పేసింది. తమకూ ఇదే కావాలన్నట్లుగా వెంటనే మరో హీరోయిన్ కోసం వెతకటం ప్రారంభించారు. చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు., అంతా తిరిగి అలిసిపోయి మన లక్ష్మీ ఉంది కదా అన్నారు.

దీంతో మరోసారి విశాల్ తో కలసి నటించే అవకాశం వచ్చింది. ‘పాండియనాడు’ తర్వాత సుశీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా హిట్ సాధిస్తుందని విశాల్ చెప్తున్నాడు. అటు హీరోయిన్ గురించి చెప్తూ... డైరెక్టర్, హీరోయన్, తనది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని తెలిపాడు. హీరోయిన్ కు మంచి పాత్ర ఉన్న సినిమలో లక్ష్మి తనను తాను నిరూపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నాడు. తెలుగువాడైన విశాల్ చాలామందికి తమిళ హీరోగానే తెలుసు. అలా కోలీవుడ్ తో పెనవేసుకున్న ఆయన, త్వరలో టాలీవుడ్ లో కూడా సినిమా తీస్తున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sruti hassan  laxmi menon  vishal  film news  

Other Articles