Fight scenes of linga shooted in ramoji film city

rajinikanth, rajinikanth movies, rajinikanth latest, rajinikanth wiki, linga movie, linga movie release, linga songs, linga rajinikanth stills, jagapati babu, jagapati babu movies, latest news, film news, tollywood, sandalwood, koliwood, tamil movies, telugu movies, ramoji film city, hyderabad tags : linga, rajinikanth, jagapati babu, latest news

linga movie making very fastly days ago rajinikanth came to hyderabad ramoji film city for fight scenet between he and jagapatibabu : linga movie shooting in ramoji film city scenes of fight between jagapati babu and rajinikanth

ఫిలింసిటీలో జగపతిని కొట్టిన రజినీ

Posted: 09/18/2014 04:41 PM IST
Fight scenes of linga shooted in ramoji film city

హైదరాబాద్ శివార్లోని రామోజి పిలింసిటీలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు హీరో బాగా జగపతి బాబు కొట్టుకున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలు సినిమా యూనిట్ వెల్లడించింది. అసలు వివరాలు చూస్తే., ఇదంతా సూపర్ స్టార్ రాబోతున్న సినిమా ‘లింగా’ షూటింగ్ రామోజి ఫిలిం సిటీలో జరిగింది. సినిమాలోని ఫైట్ సన్నివేశాలను ఇక్కడ షూట్ చేశారు. ఇందులో భాగంగా రజిని జగపతి మద్య షూట్ సీన్లు జరిగాయి. యాక్షన్ హీరోగా కన్పించే రజిని బాగా ఫైట్ చేశాడని ‘లింగా’ వర్గాలంటున్నాయి.

సినిమాలో ప్రధానంగా ఉండే కొన్ని ఫైట్ సీన్లను షూట్ చేశామని త్వరలోనే హైదారబాద్ షూటింగ్ పూర్తవుతుందని వారు చెప్తున్నారు. తెలుగు, తమిళ బాషలతో పాటు పదికిపైగా బాషల్లో సినిమా డబ్ చేస్తున్నారట. అన్ని ప్రాంతాల్లో రజినికి ఫ్యాన్స్ ఉండటంతో వారికోసం సినిమాను డబ్ చేయక తప్పటం లేదంటున్నారు. ఇక సినిమాలో రజినీ పాత్ర గతంలో కంటే కొత్తగా ఉంటుందని చెప్తున్నారు. అయితే స్టార్ స్టైల్, డైలాగ్స్, ఫైట్స్ లో ఎక్కడా తగ్గకుండా అదనపు లుక్ తీసుకొస్తున్నామని అంటున్నారు.

కే.ఎస్.రవికుమార్ ఈ సినిమాకు డైరెక్టర్ గా ఉన్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా ఉండగా., రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత, ఇక ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకులకు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని సినిమా యూనిట్ అంటోది. బహుశా రజిని బర్త్ డే కానుకగా ఏడాది చివరి నెలలో విడుదలయ్యే చాన్స్ ఉందని కోలీవుడ్ వర్గాలతో పాటు ఫిలింనగర్ టాక్ కూడా విన్పిస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : linga movie  rajinikanth  jagapathi babu  ramoji film city  

Other Articles