Nithya menon to act in mother character in her next movie

nithya menon, nithya menon wiki, nithya menon movies, nithya menon banglore, nithya menon latest movies, nithya menon movies, nithya menon hot photos, heriones images, tollywood, bollywood, maliwood, koliwood, tollywood, mother, become mother, latest news, onamalu movie

famous heroine nithya menon ready to act in mother character for tejaswi of ice cream film in her next movie : nithya feels happy and exited for acting in mother character in her movis

తల్లి అవుతున్నందుకు నిత్య సంతోషం

Posted: 09/17/2014 11:45 AM IST
Nithya menon to act in mother character in her next movie

చిన్న వయస్సులో తల్లి కావటం అంటే ఎవరికైనా కష్టమే.. తల్లి పాత్ర పోషించాలన్నా హీరోయిన్లు కూడా వెనకడుగు వేస్తారు. తల్లి పాత్ర ఒప్పుకుంటే ఇక తమకు అన్ని ఆంటీల క్యారక్టర్లే వస్తాయని భయపడతారు. కానీ నిత్యమీనన్ మాత్రం తల్లి అవుతున్నందుకు సంతోషిస్తోంది. ఈ విషయం తనకు ఎంతగానో ఆనందం కల్గిస్తోందని చెప్తోంది. అప్పుడే నిత్య తల్లేమిటి., పెళ్లి కూడా కాకుండా అని అనుకుంటున్నారా. అయితే కుట్టి నిజంగా తల్లి కావటం లేదు.. ఓ సినిమాలో ఆమె తల్లి పాత్ర పోషించేందుకు ఒప్పుకుంది. అందాల ఆరోబతకు అంతా సిద్ధం అవుతుంటే తాను అనురాగం పంచుతానని చెప్తోందీ కేరళ కుట్టి.

‘ఓనమాలు’ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాలో తల్లి క్యారెక్టర్ పోషించేందుకు నిత్య ఒప్పుకుందట. ‘ఐస్ క్రీం’ సినిమాలో నటించిన తేజస్వికి తల్లిగా మలయాళీ ముద్దుగుమ్మ నటించనుంది. కధ వినగానే ఎగిరిగంతేసిందట. ఇలాంటి వెరైటీ.., ప్రయోగాత్మక కధల కోసమే తాను ఎదురుచూస్తున్నా అని చెప్పిందట. అంతేకాకుండా.. గ్లామర్ పాత్రలంటే తనకు ఇష్టముండదనీ.., ఇలాంటి ప్రయోగాలయితే బాగా ఇష్టంగా చేస్తానని డైరెక్టర్ తో అన్నదని ఫిలింనగర్ టాక్. ఇందుకోసం డైరెక్టర్ చెప్పిన నిబందనలకు ఒప్పుకుని తల్లి అయ్యేందుకు ఒప్పందంపై సంతకం కూడా చేసేసిందట. ఇప్పుడీ విషయం సౌత్ సిని ఇండస్ర్టీల్లో సంచలన వార్తగా చర్చ జరుగుతోంది. మంచి కెరీర్ లో ఉన్న హీరోయిన్లు ఎవరూ ఇలాంటి నిర్ణయాన్ని కనీసం ఆలోచించరు కూడా అలాంటిది ఏకంగా సినిమా ఒప్పేసుకుంది. అంత ధైర్యం ఏమిటి.. అసలు సినిమా క్యారెక్టర్లు.., కధ ఏమయి ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారంతా.

‘అలా మొదలైంది’ అంటూ తెలుగు తెరకు పరిచయం అయిన నిత్య మీనన్.. దక్షిణ ఇండస్ర్టీలు అన్నిటిలో సినిమా అకౌంట్లు ఓపెన్ చేసింది. ప్రతి చోటా ఆమెకు మంచి స్పందనే వచ్చింది. ఎత్తు తక్కువైనా... ప్రేక్షకులు ఒప్పుకున్నారు. దీంతో సినిమాలు బాగానే ఆడాయి. ‘‘గుండెజారి గల్లంతయిందే’’ హిట్ కావటంతో తెలుగులో ఇంకా ఆఫర్లు వస్తున్నాయని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. అటు ఇతర బాషా సినిమాలను కూడా చర్చించి కధలు చూస్తోందట. మరి ఇలాంటి సమయంలో పెద్ద బాద్యత అయిన తల్లి పాత్రను పోషిస్తుందా లేదా చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithya menon  mother  latest news  flm news  

Other Articles