Rajamouli review on i and govindudu andarivadele audio

govindudu andarivadele audio, govindudu andarivadele, govindudu andarivadele audio songs free download, govindudu andarivadele audio release, govindudu andarivadele audio release photos, govindudu andarivadele release date, govindudu andarivadele ramcharan tej, i movie, i audio release, i audio songs free download, i tamil audio songs, i telugu audio songs free download, i release date, director shankar, vikram, arnold

telugu director rajamouli responded and given on govindudu andarivadele and i movies audio releases : rajamouli who is telugu famous director praises directors of govindudu andarivadele and i movies

గోవిందుడి ‘ఐ’పై జక్కన్న రివ్యూ

Posted: 09/16/2014 11:53 AM IST
Rajamouli review on i and govindudu andarivadele audio

రాజమౌళి సినిమాలు తీయటంలోనే కాదు.. ఇతరుల సృష్టిపై కామెంట్లు చేయటంలో కూడా పేరుపొందారు. ఆడియోలు, టీజర్లు, ప్రోమోలు, ట్రైలర్లను చూసి ఎలా ఉన్నాయో కామెంట్లు ఇస్తుంటాడు. ఎవరేమనుకుంటారో పట్టించుకోకుండా కేవలం వాస్తవాలను మాత్రమే చెప్తాడని రాజుకు పేరుంది. అలాంటి జక్కన్న సోమవారం విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ఐ’ సినిమా ఆడియో విడుదలపై కామెంట్లు చేశాడు. రాత్రి రెండు ఆడియో ఫంక్షన్లు చూసి వెంటనే స్పందించాడు. తెలుగు, తమిళ భారీ అంచనాల సినిమాలపై ఆయన రివ్యూ ఏమిటో మనమూ చూద్దాం.

ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ గోవిందుడు అందరివాడేలే’ ఆడియో విడుదలపై స్పందనను చూస్తే.., చెర్రికి పోనీ టైల్ బాగా సూట్ అయిందన్నారు. అటు ఆడియో ఫంక్షన్ ద్వారా కృష్ణవంశీ మరోసారి తనలోని టాలెంట్ బయటపెట్టాడని..,ఆయన మళ్ళీ ఒకప్పటి వెలుగులు పొందుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సినిమా హిట్ కృష్ణ-చరణ్ లకు పెద్ద హిట్ ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఇక శంకర్ మాయ అయిన ‘ఐ’ సినిమాపై కూడా రాజమౌళి రివ్యూ ఇచ్చారు. ఐ టీజర్ గురించి మాటల్లో చెప్పలేమన్నారు. శంకర్ సార్ ఆర్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని కితాబిచ్చారు. ఎవరూ శంకర్ సృజనాత్మకతకు దగ్గరగా కూడా రాలేరు అని చెప్పారు.

ప్రస్తుతం బాహుబలి సినిమా చేస్తున్న రాజమౌళి షూటింగ్ కు కొద్ది విరామం ప్రకటించారు. ఈ లోపు ఈ సినిమా హీరో, విలన్లతో క్రికెట్ మ్యాచ్ ఆడిస్తారట. మ్యాచ్ వీడియోను నెట్ లో పెట్టి పాపులారిటీ కొట్టేయాలని జక్కన్న ప్లాన్ వేస్తున్నాడు. అప్పుడప్పుడు ఇలా రివ్యూలు, సోషల్ నెట్వర్క్ సైట్లలో కామెంట్లు చేస్తూ., టాలీవుడ్ నోటిలో నానుతుంటాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : govindudu andarivadele  i movie  rajamouli  shankar  

Other Articles