Loukyam movie will beat attarintiki daredi says gopichand

pawan kaylan, pawan kalyan movies, pawan kalyan latest, pawan kalyan marriage, gopichand, gopichand movies, loukyam, gopichand marriage, gopichand comments on pawankalyan, tollywood news, latest news, attarintiki daredi

loukaym movie will be a big hit and beats attarinitiki daredi record says hero gopichand : hero gopichand confident his loukyam movie will be a hit same as pawan's attarintiki daredi

‘‘అత్తారింటికి‘‘ పోటి ఇస్తానంటున్న చందు

Posted: 09/15/2014 01:43 PM IST
Loukyam movie will beat attarintiki daredi says gopichand

టాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పేరును ఎలా వాడుకుందామా.. అని ఆలోచిస్తుంటే హీరో గోపిచంద్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కు పెద్ షాకిచ్చాడు. తన సినిమా అత్తారింటికి దారేది కంటే హిట్ అవుతుందని చెప్పాడు. త్వరలో వస్తున్న లౌక్యం సినిమాపై విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమలో చందు ఈ కామెంట్లు చేశాడు. ‘అత్తారింటికి దారేది’తో పవన్ కు ఎలాంటి హిట్ వచ్చిందో.. ‘లౌక్యం’తో తనకు కూడా అలాంటి హిట్టే వస్తుందన్నాడు. అంతేకాదు పవన్ సినిమా కంటే పెద్ద విజయాన్నే లౌక్యం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ కామెంట్లపై పవన్ అభిమానులు షాక్ అవుతున్నారు. గోపిచంద్ ఏమిటి ఇలా అంటున్నాడు..అని కామెంట్లు కూడా చేస్తున్నారు.

‘లౌక్యం’ సినిమా అన్ని వర్గాలకు నచ్చేలా తీశామని.., ఇది గొప్ప విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ.., ఈ సినిమాకు అంత ఛాన్స్ ఉందా? అనేది తెలియాలి. హిట్ అయితే సరే కాని.. అత్తారింటికి దారేది సినిమాను దాటేంత విజయం వస్తుందా? అనేది కూడా తెలియదు. మరి గోపిచంద్ ఎందుకలా కామెంట్లు చేశాడంటే.. విజయవాడ తన అత్తారిల్లనీ.., ఈ ప్రాంతంలో అత్తారింటికి దారేది ఎంత పెద్ద హిట్ అయిందో ‘లౌక్యం’ సినిమా కూడా అదే విధంగా.., అంతకంటే ఎక్కువగా విజయం సాధిస్తుందని చెప్పాడు.

అసలే కెరీర్ దూకుడుగా అనేట్లుగా కాకుండా.., అలా సాగుతున్న తరుణంలో ఇలాంటి కామెంట్లు చేసి వివాదాలను వేలు పోసి కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అయితే ఇక్కడ కూడా పవన్ పేరును వాడుకోవటం వల్ల సినిమాకు ఇదో రకమైన పబ్లిసిటీ అని చెప్పేవారు కూడా ఉన్నారు. కామెంట్లతో పవన్ కు పోటి ఇస్తే.., విడుదలలో అగ్ర హీరోలకు పోటి ఇస్తోంది లౌక్యం. ఆగడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలతో పాటుగానే ఈ సినిమాను కూడా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వద్దు, జాగ్రత్త.. అని కొందరు పెద్దలు చెప్తున్నా కూడా ఎంటర్ టైన్ మెంట్ సినిమా కావటంతో ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్తున్నారు. చూడాలి ఇది విశ్వాసమా లేక ఓవర్ కాన్ఫిడెన్సా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kaylan  loukyam gopichand  tollywood  

Other Articles