Tamil actress sunaina special interview about personal life

tamil actress sunaina, sunaina hot photos, telugu girl sunaina, sunaina special interview, sunaina latest movies, sunaina biography, sunaina hot photo shoot, sunaina hot stills

tamil actress sunaina special interview about personal life

ప్రేమలో పడ్డాను.. కానీ బాయ్ ఫ్రెండ్ మాత్రం లేడు? సునైనా

Posted: 09/13/2014 06:01 PM IST
Tamil actress sunaina special interview about personal life

‘‘నీర్ పరవై’’ చిత్రం తమిళ చిత్రపరిశ్రమలో కథానాయికగా రాణిస్తున్న నటి సునైనా.. పేరుకు తగ్గట్టే సొగసైన పదహారణాల తెలుగమ్మాయి. ఇంతకుముందు కంటే కాస్త బరువు, పరువాలు పెంచుకుని ఇతర తారలతో సమానంగా అభినయంలో ఆరితేరిన సుందరీమణి! అయితే పరిశ్రమలో ఆశించినంత స్థాయికి మాత్రం చేరుకోలేకపోయింది. అయినప్పటికీ తాను పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకోవడానికి తనవంతు కృషి, శ్రమ నిరంతరం చేస్తూనే వుంటానని ధృఢసంకల్పాన్ని వ్యక్తం చేస్తోంది. నటిగా అవకాశాలు రాకపోతే బాధపడకుండా నిరంతరం శ్రమిస్తూనే వుంటానని.. ప్రతిఒక్కరి జీవితంతో మంచి కాలం అంటూ వస్తుంది.. తన జీవితంలో కూడా ఆ కాలం ఎప్పుడో ఒకరోజు వస్తుందని ఆమె నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

కథలో వున్న తన పాత్రకు తగ్గట్టు అందాలను ఆరబోస్తూ కుర్రకారులను తనవైపు ఆకర్షించుకున్న ఈ అందాల తార... గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని హద్దులుంటాయని.. పాత్రమేరకే అందాలను ప్రదర్శిస్తానని చెప్పుకొచ్చింది. తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు... డర్టీపిక్చర్, క్వీన్ లాంటి తరహా చిత్రాల్లో నటించానికి సిద్ధమేనని అంటోంది. అంటే.. ఈ అమ్మడు ఎంత ఎక్స్ పోజింగ్ చేయడానికైనా చెప్పకుండానే చెబుతోంది. ఇంతవరకు బాగానే వుంది కానీ... తాను ‘‘ప్రేమలో పడ్డాను’’ అని అంటూనే.. బాయ్ ఫ్రెండ్ మాత్రం ఒక్కడు కూడా లేడంటూ సందేహాల్లో ముంచేసింది. ఇదెలా సాధ్యమవుతుంది..? అని ప్రశ్నించిన తరుణంలో... అందుకు తనదైన శైలిలో జవాబిచ్చింది ఈ తెలుగుతార!

మీకెవరైనా బాయ్ ఫ్రెండ్ వున్నారా..? అని ఒక విలేకరి ప్రశ్నించిన తరుణంలో ఆమె దానికి జవాబిస్తూ... తానెప్పుడూ అబద్ధం చెప్పలేదని, ఇప్పుడు కూడా నిజమే చెబుతున్నానంటూ బాయ్ ఫ్రెండ్ లేడని స్పష్టం చేసింది. గతంలో కూడా ఎవ్వరూ వుండేవారు కాదని సందేహంగా పేర్కొంది. అయితే తాను ‘‘ప్రేమలో పడ్డాను’’ అనే సినిమాలో మాత్రమే నటించానని చెప్పిన ఈ అమ్మడు.. నిజజీవితంలో మాత్రం ఎవ్వరినీ ప్రేమించలేదని క్లారిఫికేషన్ ఇచ్చుకుంది. అదీ అసలు మేటర్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunaina  tamil actresses  telugu actresses  celebrity interviews  

Other Articles