Singer smitha latest birthday interview

singer smitha, smitha hot photos, singer smitha birthday interview, singer smitha hot photo shoot, singer smitha malleswari movie

singer smitha latest birthday interview : on her birthday occassion singer smitha said that she takes wrong step by acting in malleswari movie

‘‘మల్లీశ్వరి’’లో చిత్రంలో స్మిత తప్పు చేసిందట! కానీ...

Posted: 09/05/2014 04:45 PM IST
Singer smitha latest birthday interview

(Image source from: singer smitha latest birthday interview)

తెలుగు చిత్రపరిశ్రమలో తొలి పాప్ సింగర్ గా సన్సేషన్ క్రియేట్ చేసిన స్మిత... కొన్నాళ్లపాటు ఇటు తెలుగు, అటు హిందీలో పాప్ ఆల్బమ్స్ తో కుర్రకారులను హోరెత్తించింది. ఆ తర్వాత తెరమీద కనిపించడమే మానేసింది. అయితే తిరిగి చాలారోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చుకున్న స్మిత.. పూర్తిగా తన రూట్ నే మార్చేసింది. ఆధ్యాత్మిక బాటపట్టి, భక్తిగీతాలు పాడుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తోంది. మీడియాతో ఎన్నడూ తన గురించిగానీ, తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కానీ చెప్పిని స్మిత.. తన బర్త్ డే సందరర్భంగా మీడియాముందుకు వచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే తాను మల్లీశ్వరి చిత్రంలో నటించి చాలా పెద్ద తప్పు చేశానని పేర్కొంది. దీంతో అక్కడున్న మీడియాజనాలు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

మీడియా సమావేశంలో భాగంగా ఒక విలేకరి.. ‘‘మల్లీశ్వరి సినిమా తర్వాత ఇతర చిత్రాల్లో ఎందుకు నటించలేదు’’ అని ప్రశ్నిస్తే.. అందుకు బదులు స్మిత.. తాను ఆ సినిమాలో నటించి చాలా పెద్ద చేశానని పేర్కొంది. తనకు అసలు సినిమాల్లో రావడం అస్సలు ఇష్టం లేదని.. కానీ ఆ సినిమాలో ఎందుకు నటించానో అర్థం కావడంలేదని తెలిపింది. నటన మీద తనకు అంతగా మక్కువ లేదని స్పష్టం చేసింది. అయితే ఆ సినిమాలో నటించడం వల్ల తనకు ఓ లాభం కలిగిందని చెప్పుకొచ్చింది. ఆ మూవీ కెమెరామెన్ సమీర్ రెడ్డి తనకు మంచి ఫ్రెండ్ అయ్యాడంటూ తెలిపిన స్మిత.. ఈమధ్యే అతను యోగేశ్వరరాయ అనే భక్తి ఆల్బమ్ ను ఫ్రీగా చేసిపెట్టాడంటూ చెప్పింది.

అలాగే భర్తతో విడిపోయారనే ప్రచారాలు సాగుతున్నాయి కదా.. దానిమీద మీ అభిప్రాయమేంటి..? అని ఇంకొక విలేకరి స్మితను ప్రశ్నిస్తే.. అందుకు ఆమె కొన్ని నీతివాక్యాలను గుర్తుచేసింది. ‘‘సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు రావడం సహజమే కదా.. నిప్పులేనిదే పొగరాదు కదా అని మెలిక పెడతారు. కానీ ఇక్కడ నిప్పులేదు.. పొగ ఎక్కడ నుంచి వస్తుంది..? అని ఎదురు ప్రశ్నవేసింది. ప్రస్తుతం తాను, తన భర్త శశాంక్ హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నామని స్పష్టం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singer smitha  malleswari movie  birthday celebrations  

Other Articles