Manchu lakshmi comments manchu manoj producer bellamkonda suresh

manchu lakshmi, manchu manoj, manchu family, bellamkonda suresh, bellamkonda srinivas, rabhasa movie news, gandharwa mahal

manchu lakshmi comments manchu manoj producer bellamkonda suresh : manchu manoj said that there is not relationship between her and manchu manoj in money problems

మనోజ్ తో సంబంధం లేదంటున్న లక్ష్మీ మంచు!

Posted: 09/04/2014 04:09 PM IST
Manchu lakshmi comments manchu manoj producer bellamkonda suresh

(Image source from: manchu lakshmi comments manchu manoj producer bellamkonda suresh)

అవును.. మనోజ్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని లక్ష్మీ మంచు తాజాగా ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇన్నాళ్లవరకు తమ మధ్య వున్న అక్కాతమ్ముళ్ల బంధాన్ని నేడు లక్ష్మీ మంచు తెగదెంపులు చేసేసింది. అది కూడా కేవలం డబ్బులకోసమే లక్ష్మీ ఈ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. లక్ష్మీ ఎందుకు ఇలా మాట్లాడింది..? అంటూ ప్రతిఒక్కరు ప్రశ్నలను లెవనెత్తారు. అయితే ఫైనల్ గా తాను అలా ఎందుకు చెప్పిందో క్లారిఫికేషన్ ఇచ్చేసింది.

రభస సినిమా రిలీజ్ కు ముందు లక్ష్మీ మంచు, నిర్మాత బెల్లంకొండ సురేష్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే! ‘‘రభస’’ మూవీ షూటింగ్ నేపథ్యంలో ‘‘గంధర్వ మహల్’’లో షూటింగ్ జరుపుకుంటామని.. అందుకు తాను రూ.58 లక్షల దాకా డబ్బులు ఇస్తానని సురేష్, లక్ష్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం... ‘‘రభస’’మూవీ షూటింగ్ ను ఆ మహల్ లో పూర్తి చేసుకున్నారు. కొన్నిరోజులు కూడా గడిచిపోయాయి కానీ సురేష్ మాత్రం లక్ష్మీకి డబ్బులు ముట్టజెప్పలేదు. దీంతో వారిమధ్య చాలా రాద్ధాంతమే జరిగిందిలెండి! చివరికి ఒకరిమీద ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే ఫైనల్ నిర్మాతే స్వయంగా మంచువారి ఫ్యామిలీతో కలిసి తమ మధ్య జరుగుతున్న ఈ గొడవను సద్దుమణిగేలా చేశాడు. అయితే దీనికి సంబంధించి మంచు లక్ష్మీగానీ, బెల్లంకొండగానీ అఫీషియల్ గా స్టేట్ మెంట్ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు.

ఇదిలావుండగా.. తాజాగా ఈ గొడవ మీద మంచులక్ష్మీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ గొడవలో న్యాయం తనవైపే వుందని చెప్పుకొచ్చింది. ‘‘నా తమ్ముడు మంచుమనోజ్ అతనికి డబ్బులివ్వాలని చెప్పి.. నాకు డబ్బులివ్వకుండా ఆపాడు. ఇందుకు నేనెలా ఒప్పుకుంటాను. ఈ డబ్బుల విషయంలో నాకు, మనోజ్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయం మీద వారిద్దరు పరస్పరం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావాలిగానీ.. నా డబ్బుల్ని ఆపేస్తే ఎలా..? అందుకే నాకివ్వాల్సిన పేమెంట్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడ్డా’’ అని చెప్పుకొచ్చింది. గతంలో మనోజ్ తో కలిసి సినిమా తీసేందుకు నిర్మాత బెల్లంకొండ సురేష్ ముందుకొచ్చాడు. అందుకు అడ్వాన్స్ కు తనకు 30 లక్షలు కూడా ఇచ్చాడట! అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కానీ మనోజ్ మాత్రం ఆ 30 లక్షలు తనకు తిరిగి ఇవ్వలేదని సురేష్ వాపోతున్నాడు. ఈ విషయాన్నే లక్ష్మీ తాజాగా గుర్తు చేస్తూ.. మనోజ్ తనకు డబ్బులివ్వకపోతే నాకేంటి సంబంధం అని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu lakshmi  manchu manoj  bellamkonda suresh  rabhasa movie  gandharwa mahal  

Other Articles