(Image source from: tamanna bhatia ready to do everything to get back her stardom)
టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నాకు ఈమధ్య కాలం అంతగా బాగా నడవటం లేదని అందరికీ తెలిసిన విషయమే! తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసి తెలుగు చిత్రాలను వదులుకున్న ఈ అమ్మడు.. తన అదృష్టాన్ని బాలీవుడ్ పరీక్షించుకోవడానికి ముంబైకి మకాం మారిస్తే.. అక్కడ ఏకంగా పెద్ద దెబ్బ తగిలింది. వరుసగా తాను నటించిన సినిమాలన్నీ ఘోరంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడిపోవడంతో ‘‘ఐరెన్ లెగ్’’ అనే పేరును నమోదు చేసుకుంది. దీంతో ఏమి చేసేదిలేక తిరిగి టాలీవుడ్ కి తట్టాబుట్టా సర్దుకుని వచ్చేసింది. ఇప్పటికే ‘‘ఆగడు, బాహుబలి’’ వంటి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. మునుపటిలాగా ప్రేక్షకాదరణ తమన్నాకు చాలావరకు తగ్గిపోయింది. దీంతో తన స్టార్ డమ్ తిరిగి పొందడానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైనుంచి వచ్చిరాగానే ఇక్కడి ప్రేక్షకులు, దర్శకనిర్మాతలను తన వలలో పడేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఒకప్పుడు టాలీవుడ్ లో తనదైన అందం, ప్రతిభతో కోట్లాది అభిమానులను మూటగట్టుకుని తమన్నా ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే! కానీ ముంబైకి వెళ్లిపోవడంతో ఈమెకు ఆ ఆదరణ తగ్గిపోవడంతోపాటు నెగెటివ్ గా చాలానే కామెంట్లు వచ్చాయి. దీంతో వీటిని చేరిపేసుకోవడానికి ఈ అమ్మడు తనదైన రీతిలో వ్యాఖ్యానాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రేక్షకులను ఆకర్షించుకోవడానికి బాగానే ప్లాన్ చేస్తున్నట్టుంది తమ్మూ! ‘‘ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోగానీ.. ఈ జన్మలో ఇంతమంది ప్రేక్షకులను అలరిస్తున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది.. వీరంతా మమ్మల్ని ఎందుకు ఇలా ఆరాధిస్తారోనని! ప్రేక్షకులను చూసినప్పుడల్లా వారికళ్లలో వున్న భావాలను చూస్తే చాలా ఉద్వేగంగా వుంటుంది. అలాంటి భావన మళ్లీమళ్లీ కలగించాలని అనిపిస్తోంది. అందుకు నేను ఏమి చేయడానికైనా సిద్ధమే’’నంటూ అంటోంది తమన్నా!
‘‘స్నేహబంధం కంటే ప్రేక్షకుల అభిమానమే ఎంతో ప్రాధాన్యతను కలిగిస్తుంది. అందుకే నేను సినిమాలు చేయడానికి అంగీకరించాను’’ అని తమన్నా తరుచుగా చెబుతూ ప్రేక్షకులను వలలో పడేస్తూ వచ్చింది. కానీ మధ్యలో కొన్నాళ్లపాటు కనుమరుగు కావడంతో ప్రేక్షకులు ఈమెను పట్టించుకోవడం మానేశారు. అందుకే ప్రేక్షకుల్లో తిరిగి తన అభిమానాన్ని సంపాదించుకోవడం కోసమే తమన్నా ఇలా కామెంట్లు చేస్తోందంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్ని సినిమాలు చేసినా.. ప్రేక్షకాదరణ లేనిదే స్టార్ డమ్ సాధ్యం కాదని తెలుసుకున్న తమన్నా... ఆ కోవలోనే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరి మునుపటిలాగే ఈ అమ్మడు తన అభిమానాన్ని సంపాదించుకుంటుందో లేదో.. తన తదుపరి సినిమాల ద్వారా తెలుసుకోవాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more